ఖుర్ఆన్

దివ్య ఖుర్‌ఆన్‌ మానవీయ జీవనికి ధర్మదాయి

Qur’an is the Guidance of Humanity

సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం,

మానవుడు సన్మార్గాన్ని వదలి సత్యం, ధర్మం, న్యాయాన్ని మరచి అంధకారంలో కొట్టు మిట్టాడుతూ, జీవితాన్ని వెళ్ళబోస్తున్నపుడు మాన వునికి జీవనజ్యోతిలా వెలుగుతూ రుజుమార్గాన్ని చూపింది దివ్య ఖుర్‌ ఆన్‌. పవిత్ర గ్రంథమయిన ఖుర్‌ఆన్‌ గురించి అల్లాహ్‌ ఈ విధంగా తెలియ జేస్తున్నాడు:

إِنَّ هَـٰذَا ٱلۡقُرۡءَانَ يَہۡدِى لِلَّتِى هِىَ أَقۡوَمُ

యదార్థం ఏమిటంటే ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా సరియైన మార్గాన్ని చూపుతుంది”. (బనీ ఇస్రాయీల్‌ 9,10)
ఈ పవిత్ర ఖుర్‌ఆన్‌ దైవగ్రంథం ఎవరి తరపున వచ్చింది? మానవునికి ఎలా లభ్యమయింది? దీన్ని ఎవరు సృష్టించారు? మానవుడు సృష్టించడానికి వీలుకాని గ్రంథం ఇది. ఈ గ్రంథానికి మూలకర్త ఎవరు? ఒక్కసారి ఆలోచించు, సర్వలోకాలకు మూలకారకుడై సమస్త జగత్తును, సర్వ మానవాళిని నడిపిస్తూ ఆకాశంలో సింహాసనం మీద ఉన్న, పరమేశ్వరుడు అయిన అల్లాహ్‌ సృష్టించాడు ఆ గ్రంథం మానవాళికి ఏ విధంగా చేరిందంటే దైవదూతల్లోకి పెద్దవారైన జిబ్రయీల్‌ (అస్సలామ్‌) ద్వారా. అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) పై పవిత్ర దైవ గ్రంథమైన ఖుర్‌ఆన్‌ సందేశవాక్కు 23 సంవత్సరాల కాలంలో పూర్తి అయింది.

చిట్ట చివరి దైవ గ్రంధం దివ్యఖుర్ఆన్

Qur’an is the Final Revelation

దైవ వచన లిఖిత రూపమే ఖుర్ఆన్. సృష్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ముహమ్మద్(స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు. ఖుర్ఆన్, సృస్టికర్త తన దైవదూత జిబ్రాయీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స౦) పై ఈ దైవ వచనాన్ని అవతరింపజేశాడు.

1450వందల సంవత్సరాలకు పూర్వం సర్వ శక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ తన దూత (గాబ్రేయిల్) ద్వారా చివరి ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) పై క్రమ క్రమంగా 23 సంవత్సరాలలో పవిత్ర ఖుర్ ఆన్ ను అవతరింపజేశాడు. జిబ్రయీల్ (గాబ్రేయిల్) దూత దైవ సందేశాన్ని ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలకు అందజేశాడు. ఆ దూత ప్రవక్తలకు మానవ రూపంలో అవతరించేవాడు. కొంత మంది ప్రజలు మానవ రూపంలో ఉన్న ఆ దూతను దేవునిగా భావించసాగారు.

ముహమ్మద్ (స. అ. సం) నిరక్షరాస్యులు. ఆయన పవిత్ర ఖుర్ ఆన్ ను దేవుని సహాయ తో జ్ఞాపకం చేసుకొని తన శిష్యులకు బోధించి తద్వారా ప్రజలందరికీ చేరవేశారు.

ఖుర్ ఆన్ అవతరిచిన నాటి నుండి 1450 ల సంవత్సరాలుగా ఎటువంటి మార్పులు చేర్పులకు గురికాని ఏకైక గ్రంధం. దానిని రక్షించే బాధ్యత దేవుడు స్వయంగా తీసుకున్నాడు. ఈ ఖుర్ ఆన్ గ్రంధం ప్రతి తరం వారికి యుగాంతం వరకు మార్గదర్శకం. మరియు ముహమ్మద్ (స. అ. సం) చిట్ట చివరి దైవ ప్రవక్త.

ఖురాన్ ఘనత

The Greatness of The Qur’an

ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.

ఇది సర్వలోక ప్రభువు అవతరింపజేసిన (అద్భుత) వాణి. దీన్ని తీసుకొని నమ్మకస్తుడయిన దైవదూత స్పష్టమయిన అరబీ భాషలో నీ హృదయఫలకంపై అవతరింప జేశాడు,  (షు అ రా : 192)

ఖుర్‌ఆన్‌ అనే ఈ జ్ఞాన సాగరాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఈ గ్రంథ రాజం తెలియపర్చే యదార్థాల వరకు,అద్భుత విషయాల వరకు చేరుకోవడానికి మనకి ఎన్ని యుగాలు అవసరమో తెలియదు. ఈ గ్రంథ విశిష్ఠత గురించి కలం కదిలించి వ్రాయడం అంటే- కొన్ని కోణాలను మనిషకి తెలిసిన జ్ఞానం, అనుభవం కొద్దీ గ్రహించి చెప్పడమే అవుతుంది. ఈ గ్రంథ జ్ఞానాన్ని ఏ కలం, మరే పుస్తకం ద్వారానూ ఇనుమడింప జేయలేము. ఇమామ్‌ ఫఖ్రుర్రాజీ (ర)ఇలా అభిప్రాయాపడ్డారు: ఖుర్‌ఆన్‌ అనే ఈ విజ్ఞాన భాండాగారమే గనక లేక పోయినట్లయితే ప్రపంచం మూడు వందల ప్రయో జనకర విద్యలను కోల్పోయి ఉండేది”.

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

Quran Mercy For All

ఖుర్‌ఆన్‌ అది అల్లాహ్‌ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధికరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్‌ నేర్పాడు”. (అర్రహ్మాన్‌:1,2)

కరుణామయుడు. ఆయనే ఖుర్‌ఆన్‌ నేర్పాడు”. (అర్రహ్మాన్‌:1,2)

సూరతుర్రహ్మాన్‌లో అల్లాహ్‌ తన అనుగ్రహాలెన్నినో పేర్కొన్నాడు. వాటన్నింటిలో అగ్ర స్థానం ఖుర్‌ఆన్‌కు ఇచ్చి, దానికి మించిన మహదాను గ్రహం మరోకటి లేదు అని స్పష్ట పర్చాడు. అందుకే అన్నింకన్నా ముందు మనిషి ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవాలన్నది పండితుల మాట. ఎందుకంటే అది నిలువెత్తు కారుణ్య గ్రంథం గనక. స్వచ్ఛమయిన అల్లాహ్‌ అచ్చ వాక్కు గనక. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపే వారికి అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త”. (అన్నహ్ల్‌: 89)


ఖుర్ఆన్ తెలుగు భావానువాదం

అరబీ భాష నుండి తిన్నగా తెలుగులో ప్రచురించబడిన ఉత్తమ ఖుర్ఆన్ భావానువాదాలలో ఇదొకటి. డాక్టర్ అబ్దుల్ రహీమ్ మౌలానా దీనిని అనువదించారు. ఉత్తమ క్యాలిటీ MP3 ఆడియో.

ఖుర్ఆన్ తెలుగు భావానువాదం (అరబీ & తెలుగు)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Search Videos

Video Share RSS Module

Go to top