వ్యాసాలు

ఖుర్'ఆన్ పిలుపు నిజ సృష్టికర్త వైపు

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعْبُدُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

ప్రజలారా!   మిమ్మల్నీ,   మీకు   పూర్వం   వారినీ   పుట్టించిన   మీ   ప్రభువునే   ఆరాధించండి-తద్వారానే   మీరు   (పాపాల   నుండి)   సురక్షితంగా   ఉంటారు.📖(Quran - 2 : 21)🌷

ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ فِرَٰشًۭا وَٱلسَّمَآءَ بِنَآءًۭ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءًۭ فَأَخْرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزْقًۭا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ

ఆయనే   మీ   కోసం   భూమిని   పాన్పుగానూ,   ఆకాశాన్ని   కప్పు   గానూ   చేశాడు,   ఆకాశం   నుంచి   వర్షాన్ని   కురిపించి,   తద్వారా   పండ్లు   ఫలాలను   పండించి   మీకు   ఉపాధినొసగాడు.   ఇది   తెలిసి   కూడా   మీరు   ఇతరులను   అల్లాహ్కు   భాగస్వాములుగా   నిలబెట్టకండి.📖(Quran - 2 : 22)🌷

وَإِن كُنتُمْ فِى رَيْبٍۢ مِّمَّا نَزَّلْنَا عَلَىٰ عَبْدِنَا فَأْتُوا۟ بِسُورَةٍۢ مِّن مِّثْلِهِۦ وَٱدْعُوا۟ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمْ صَٰدِقِينَ

మేము   మా   దాసునిపై   అవతరింపజేసిన   దాని   విషయంలో   ఒకవేళ   మీకేదన్నా   అనుమానముంటే,   అటువంటిదే   ఒక్క   సూరా   నైనా   (రచించి)   తీసుకురండి.   మీరు   సత్యవంతులే   అయితే   (ఈ   పని   కోసం)   అల్లాహ్ను   తప్ప   మీ   సహాయకులందరినీ   పిలుచుకోండి.📖(Quran - 2 : 23)🌷

فَإِن لَّمْ تَفْعَلُوا۟ وَلَن تَفْعَلُوا۟ فَٱتَّقُوا۟ ٱلنَّارَ ٱلَّتِى وَقُودُهَا ٱلنَّاسُ وَٱلْحِجَارَةُ ۖ أُعِدَّتْ لِلْكَٰفِرِينَ

ఒకవేళ   మీరు   గనక   ఈ   పని   చెయ్యకపోతే-ఎన్నటికీ   అది   మీ   వల్ల   కాని   పనే-   (దీన్ని   సత్యమని   ఒప్పుకుని)   మానవులు,   రాళ్ళు   ఇంధనం   కాగల   ఆ   అగ్ని   నుండి   (మిమ్మల్ని   మీరు) కాపాడు కోండి.   అది   సత్యతిరస్కారుల   కోసం తయారు   చేయబడింది.📖(Quran - 2 : 24)🌷

🌷📖 మన సృష్టికర్త ను మరియు మన జీవిత లక్ష్యం తెలుసుకొనుటకు ఖుర్'ఆన్ చదవండి 📖🌷

వ్యాధులు ప్రబలటానికి కారణం మన పాపాలే....

📢కోరొనా లాంటి వ్యాధి బహిరంగ అశ్లీలత, వ్యభిచారం - కారణంగానే వ్యాపించిందా!?

సృష్టి కర్త అయిన అల్లాహ్ తఆలా యొక్క ఆదేశాలకు విరుద్ధంగా జీవితం గడిపితే... ఇహలోకంలో అనేక రకాల విపత్తులకు గురవుతామని ఖుర్ఆన్, హదీసులలో చెప్పబడి ఉంది.

💁సహీ ఇబ్నుమాజహ్ హదీసులో ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే సమాజంలో వ్యభిచారం, అశ్లీలత బహిరంగంగా అయిపోతుందో ఆ ప్రదేశాలలో అంటువ్యాధులు ప్రబలుతాయని చెప్పడం జరిగింది;

  సృష్టి కర్త కారుణ్యం నుండి నిరాశచెందకండి

సోదరులారా- మనిషి దేని గురించైనా దిగులుగా ఉన్నప్పుడు, అతడి మనసు కలతగా ఉన్నప్పుడు ఉదాహారణకు ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ వల్ల గానీ, మరో రకమైన విపత్తుల వలన , కష్టాలవలన మనసు బాగులేక దిగులు చెందుతున్నప్పుడు వారికి  ధైర్యమివ్వాలని,  అల్లాహ్ మరియు ప్రవక్త (స) గారి బోధనలద్వారా వారికి ఓదార్పుకలిగించాలి.  ధైర్యాన్ని ఇవ్వలేకపోతే పోయారు భయపెట్టి కరోనా వైరస్ శోకక ముందే భయంతో ఒకరి చావుకు కారణం కాకూడదు. ఖుర్ఆన్ గ్రంధం ద్వారా మనకు ధైర్యాన్నిచ్చే అనేక ఆయతులు మనం పొందవచ్చు. అలాంటివి ముందుగా కొన్ని ఆయతులను చూద్దాం..

ముహమ్మద్ (స) ఎవరు ? (Who is Muhammad ?)

ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం

ముహమ్మద్‌ (అరబిక్ : محمد), (మొహమ్మద్‌మహమ్మద్అని కూడా పలకవచ్చు)అరబ్బులమత మరియు రాజకీయ నాయకుడు మరియుఇస్లాంయొక్క చివరిప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపరఆదమ్ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగామూసా (మోజెస్) మరియుఈసా (యేసు) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఇతనినిఇస్లాంమతస్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయినఆదమ్ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.570మక్కాలోజన్మించాడు మరియుజూన్‌ 8632లోమదీనాలోమరణించారు. మక్కా మరియు మదీనా నగరములు రెండూఅరేబియన్‌ ద్వీపకల్పములోఉన్నాయి.

ప్రవక్తలప్రార్ధనావిధానము

మానవజీవితంలోప్రార్ధనఅతిముఖ్యమైనదిదేవుడుమానవునికిజీవితంలోఅన్నిరంగాలకుసంబంధించినజ్ఞానంతనప్రవక్తలద్వారాప్రసాదించినట్లే, ప్రార్ధనఎలాచేయాలోకూడాతనప్రవక్తలద్వారానేర్పాడు. దేవునిఆజ్ఞలనుఎలాపాటించాలో, ఎలాదైవప్రసన్నతనుపొందాలో, ఎలావేడుకుంటేదైవానుగ్రహాలులభిస్తాయోప్రవక్తలుఆచరించిచూపారు. కావుననేటిమానవుడుకూడాతమఆరాధనావిధానాన్నిప్రవక్తలనుండిగ్రహించిసాధనచేస్తేదేవునిఆశీర్వాదాలుమనకులభించగలవునేటిఆధునికమానవుడుఅనేకవిషయాలలోదైవధర్మంనుంచివేరైపోయితనకునచ్చినవిధంగా  జీవిస్తున్నాడుచివరికి  దైవారాధనవిషయంలోకూడామార్గంతప్పిప్రవర్తిస్తున్నాడు. అయితే 1500 సంవత్సరాలుగాప్రపంచంలోనిముస్లింలంతాఒకేవిధంగావారి ప్రవక్తనేర్పినవిధానంలోనేదైవారాధనచేయటంఆశ్చర్యకరమైనవిషయం. నేడుముస్లింలుచేసేనమాజువిధానంగతగ్రంధాలలోనిప్రవక్తలు కూడాఆచరించారు. అయితే గ్రంధ  ప్రజలు  వాటిని  విస్మరించారు. ఇది గ్రహించాలంటే  పూర్వగ్రంధాలలో   ఆరాధనా   విధానాన్ని  పరిశీలించడం  అవసరం. ముక్కోటి  దేవతలను  ఆరాధించే   హిందువులకు  ఒక ఆరాధనపద్దతి  అంటూలేదు. బహుదైవారాధనతో పాటు  వారి  ఆరాధనా  పద్దతులుకూడా  బహురకాలు. వారి  పూజా  విధానాలన్నీ ఆచారసాంప్రదాయలే గానీ  గ్రంధ  ఆధారంతో  ఉండవు. అయితే  క్రైస్తవులకు గ్రంధంవుంది.   ప్రవక్తలు  ప్రార్ధించిన విధానం కూడా గ్రందాలలోవుంది. కాని  క్రైస్తవులు  కూడా  అనేక  బేధాలకుగురై  ఒక్కో మతసంస్థ   ఒక్కోరకమైన  ఆరాధనా విధానం  పాటిస్తున్నారు. నిజానికి  వారి  బైబిల్  ప్రకారం  దైవారాధన   ఎలాచేయాలి??  దీనికోసం  క్రింది వచనాలను  చదివితే..  నేటి  ముస్లిం  సమాజం  చేస్తున్న ఆరాధనా  పద్దతే  నిజమైన  దైవారాధనా  పద్దతిగా గ్రహించవచ్చు.

బైబిల్  ద్వారా  ప్రవక్తల  ప్రార్ధనా  విధానమేమిటో  తెలుసుకుందాం..

ప్రతి  ముస్లిం  ప్రార్ధనకు  ముందుశుధ్ధి(వజూలేకగుసుల్, బాప్తిస్మము)       చేసుకోవాలి..                                                         1. అహరోనువారికుమారులుదేవునిఆరాధించుటకువెళ్ళినపుడువజూ(వజూ అంటే ముఖము, చేతులు, ముఖము కడుగుకొనుట) చేసిరి-   నిర్గమకాండము 30-17-21 “మరియుయెహోవామోషేతోఇట్లనెను- కడుగుకొనుటకునీవుఇత్తడితోదానికొకగంగాళమునుఇత్తడిపీటనుచేసిప్రత్యక్షగుడారమునకుబలిపీటమునకునడుమదానినిఉంచినీళ్ళతోనింపవలెను  ఆనీళ్ళతో  అహరోనును  అతని   కుమారులును  తమ  చేతులను  కాళ్ళను  కడుగుకొనవలెను “                                                                                                                                                                2.మోషే, అహరోనుఅతనికుమారులు  వజూచేసిరినిర్గమ  40-30 అతడు ప్రత్యక్షపు  గుడారమునకును  బలిపీఠము నకును  మధ్య  గంగాళమును   ఉంచి  ప్రక్షాళన కొరకు  దానిలో  నీళ్ళుపోసెను. దాని యొద్ద మోషేయు  అహరోనును   అతని   కుమారులును   తమ  చేతులను  కాళ్ళను  కడుగుకొనిరి.                                       

3.ఎందుకు  శుధ్ధిచేసుకొనవలెనులేవీ 11-44  “నేను  మీదేవుడైన   యెహోవాను, నేను   పరిశుధ్దుడను   గనుక  మీరు  పరిశుధ్ధులై   యుండునట్లు   మిమ్మును   మీరు    పరిశుద్ధ  పరచు  కొనవలెను.

4.బాప్తిస్మము  లేక   శుధ్ధిచేసుకొనుట- సంఖ్యాకాండము 19-20 అపవిత్రుడు  పాపశుధ్ధి  చేసికొనని  యెడల  అట్టిమనుష్యుడు  సమాజములో  నుండి  కొట్టివేయబడును

వాడు  యెహోవా   పరిశుధ్ధస్థలమును  అపవిత్రపరచెను, పాపపరిహారజలము  వానిమీద  ప్రోక్షింపబడలేదువాడు  అపవిత్రుడు.                                                                                                                       

5. యేసు బాప్తిస్మము  పొందెను- మత్తయి 3-13- సమయమున  యోహానుచేతబాప్తిస్మముపొందుటకుయేసుగలిలయనుండి యొర్ధాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను.                                                                                                      6. పౌలు  గుసుల్చేసెను--కార్యములు 21-26  అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొని పోయి వారితో కూడ శుధ్ది చేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుధ్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను.

ముస్లింలు ప్రార్ధనకు ముందు పిలుపు(అజాన్) ఇస్తారు

మోషే ఇశ్రాయేలీయులకు- సంఖ్యాకాండము 10-1-3 యెహోవా మోషేకు  ఈలాగు సెలవిచ్చెను- నీవు రెండు వెండి బూరలు  చేయించుకొనుము, నకిషి పనిగా  వాటిని చేయింపవలెను.  అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.  ఊదువారు  వాటిని ఊదునప్పుడు సమాజపు  ప్రత్యక్షగుడారముయొక్క ద్వారము నెదుట నీయొద్దకు కూడి రావలెను.    

చెప్పులు విడుచుట

మోషే  - నిర్గమ   3-5 అందుకాయన - దగ్గరకు రావద్దు నీపాదముల నుండి నీచులను విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుధ్ధ ప్రదేశము అనెను

యెహోషువా -యెహోషువా 5-15అందుకు యెహోవా సేనాధిపతి- నీవు నిలిచియున్న యీస్థలము పరిశుద్ధమైనది నీపాదరక్షలను తీసివేయుమని యెహోషువతో చెప్పగా యెహోషువ ఆలాగుచేసెను.

అపోస్తలుల కార్యములు-7-33 అందుకు ప్రభువు – నీచెప్పులు విడువుము, నీవు నిలిచియున్నచోటు పరిశుధ్ధభూమి

ముఖము దేవాలయము(కాబా) వైపుకు త్రిప్పి మోకాళ్ళూని ప్రార్ధించుట.

 నమాజుచేయుటకు ముందు ప్రతి ముస్లిం తన ముఖాన్ని మక్కాలోని కాబా వైపు త్రిప్పి నిలబడుట విధి. ప్రవక్త ముహమ్మద్ (స) గారు కూడా మదీనాకు పోకముందు బైతుల్ మఖ్దిస్ వైపే తిరిగి నమాజు చేసేవారు.  మక్కావైపు తిరిగి నమాజ్ ఆచరించమని అల్లాహ్  ఆదేశించినందువలన అప్పటినుండి మక్కావైపుతిరిగి నమాజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందున్నప్రవక్తలంతా బైతుల్ మఖ్దిస్ వైపే తిరిగి నమాజు చేసేవారు. చూడండి....

దానియేలు - దానియేలు   6-10ఇట్టిశాసనము సంతకము చేయబడెనని  దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికివెళ్ళి , యధా ప్రకారముగా  అనుదినము ముమ్మారు మోకాళ్ళూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు  తెరువబడి యుండగా  తను దేవునికి ప్రార్ధన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

సొలొమోను-1 రాజులు 8-30 మరియు నీదాసుడనైన నేనును  నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలము తట్టు తిరిగి  ప్రార్ధన చేయునప్పుడెల్లా, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినునప్పుడెల్లా  మమ్మును క్షమించుము

దావీదు -కీర్తనలు 5-7  నేనైతే నీకృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను,  నీ యెడల భయభక్తులు కలిగి నీ పరిశుధ్ధాలయ దిక్కు చూచి నమస్కరించెదను.

   కీర్తనలు 134-2,  పరిశుధ్ధస్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి.

 కీర్తనలు 138-2 నీపరిశుధ్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను.

వంగుట మరియు మోకాళ్ళూనుట

అబ్రాహాము నేలమట్టుకు వంగెను  ఆదికాండము  18-3  నేలమట్టుకువంగి , ప్రభువా నీ కడాక్షము నామీదనున్నయెడల నీ దాసుని దాటిపోవద్దు.

మోషే నేలమట్టుకు వంగి నమస్కారము చేసెను  నిర్గమ  34-8 అందుకు మేషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారము చేసి, ప్రభువా  నామీద నీకు  కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము.

స్థెఫను-అ-కార్యములు 7-60  అతడు మోకాళ్ళూని- ప్రభువా వారిమీద ఈపాపము మోపకుమని గొప్పశబ్దముతో పలికెను. 

సాగిలపడుట లేక సాష్టాంగపడుట.

ముస్లింలంతా తమ నమాజులలో అల్లాహ్ ముందు సాష్టాంగపడతారు. ఇది ప్రవక్తలంతా పాటించిన సాంప్రదాయం

 1. అబ్రాహాము సాగిలపడెను-ఆదికాండము 17-3 అబ్రాహాము సాగిలపడియుండగా, దేవుడతనితో  మాటలాడి...
 2. మోషే అహరోనులు సాగిలపడిరి    నిర్గమ 24-1 మరియు ఆయన మోషేతో ఇట్లనెను- నీవును,అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.
 3. సంఖ్యా 16-22వారు సాగిలడి –సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి.
 4. సంఖ్యా16- 45, క్షణములో నేను వారిని నశింప జేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.
 5.  సంఖ్యా 20-6 అపుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షగుడారముయొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.
 6.  ద్వితీయో 9-25 కాగా నేను మునుపు  సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని.
 7. యెహోషువా  సాగిలపడెను- యెహోషువా  5-14 యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి- నా యేలినవాడు తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగెను.
 8. ఏలియా సాగిలపడెను-1రాజులు18-42 ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేలమీదపడి ముఖము మోకాళ్ళమధ్య ఉంచుకొనెను.
 9. దావీదు సాగిలపడెను- కీర్తనలు  95-7 రండి నమస్కారము చేసి సాగిలపడుదము,
 10.  దావీదు 99-5మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి,ఆయన పరిశుధ్ధుడు.  
 11. యేసుక్రీస్తు సాగిలపడెను-మత్తయి 26-39 కొంతదూరము వెళ్ళి సాగిలపడి-నాతండ్రీ, సాధ్యమైతే ఈగిన్నెనా యొద్దనుండి తొలగిపోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్ధించెను.
 12. యేసు - మార్కు 14-35  కొంతదూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆగడియ తన యొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు-,
 13. అవిశ్వాసి, పాపి సాగిలపడును  1కొరింధీ 14-25 ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.

చేతులు, కన్నులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్ధించుట

 1. దావీదు -కీర్తనలు 134-2 పరిశుధ్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి.
 2. కీర్తనలు 77-2  నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని,  రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది.
 3. కీర్తనలు 138-2 నీపరిశుధ్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను.
 4. సొలొమోను-1రాజులు  8-22,ఇశ్రాయేలీయుల సమాజకులందరు చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశముతట్టు చేతులెత్తి యిట్లనెను.
 5. 1రాజులు 8-54 సొలొమోను ఈలాగు ప్రార్ధించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళూనుట మాని, లేచి నిలిచిన తరువాత, అతడు మహా శబ్ధముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను.

యేసు - యోహాను 11-41 యేసు కన్నులు పైకెత్తి- తండ్రీ, నీవు నామనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.                                    

Search Videos

Video Share RSS Module

Go to top