భూత వైద్యం చేయుట

)Sorcery(

భూతవైద్యం చేయుట మహాపాపం.  ఎందుకంటే భూతవైద్యం చేసే వారు తప్పనిసరిగా అవిశ్వాసులై తీరాలి. మరియు శాపగ్రస్తుడైన షైతాన్ కు కూడా ఒక మనిషికి అవిశ్వాసం, విగ్రహారాధన నేర్పించి,  దైవ వ్యతిరేకులుగా తయారు చేయాలనే ఆలోచనతప్ప మరొకటి ఉండదు. అందువలన భూతవైద్యం మరియు దానికి సంబంధించిన మంత్ర, తంత్ర, జాల విద్యలన్నీ షైతాన్ క్రియలుగానే పరిగణించబడతాయి. ఇవి పూర్తిగా షైతాన్ సంబంధిత మాయాజాలం. ఇందులో అబద్దాలే అధికం. మానవులను పెడత్రోవ పట్టించే పనులు, మానవ వినాశనానికి , మానవ అశాంతికి గురిచేసే ఈ క్రియలన్నీ పాపాలే. కావున అల్లాహ్ ఇలాంటి పనులన్నింటినీ అసహ్యించుకుంటాడు.

అల్లాహ్ ఇలా వివరించాడు..

وَاتَّبَعُوامَاتَتْلُوالشَّيَاطِينُعَلَىمُلْكِسُلَيْمَانَوَمَاكَفَرَسُلَيْمَانُوَلَكِنَّالشَّيَاطِينَكَفَرُوايُعَلِّمُونَالنَّاسَالسِّحْرَوَمَاأُنزِلَعَلَىالْمَلَكَيْنِبِبَابِلَهَارُوتَوَمَارُوتَوَمَايُعَلِّمَانِمِنْأَحَدٍحَتَّىيَقُولاَإِنَّمَانَحْنُفِتْنَةٌفَلاَتَكْفُرْفَيَتَعَلَّمُونَمِنْهُمَامَايُفَرِّقُونَبِهِبَيْنَالْمَرْءِوَزَوْجِهِوَمَاهُمْبِضَارِّينَبِهِمِنْأَحَدٍإِلاَّبِإِذْنِاللَّهِوَيَتَعَلَّمُونَمَايَضُرُّهُمْوَلاَيَنفَعُهُمْوَلَقَدْعَلِمُوالَمَنْاشْتَرَاهُمَالَهُفِيالآخِرَةِمِنْخَلاَقٍوَلَبِئْسَمَاشَرَوْابِهِأَنفُسَهُمْلَوْكَانُوايَعْلَمُونَ(البقرة: 102).

" సులైమాన్ రాజ్యం పేరుచెప్పి షైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. కాని వాస్తవంగా సులైమాను ఎన్నడూ  అవిశ్వాసానికి  ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపజేసిన దానివెంటబడ్డారు.  ఎవడికైనా ఆవిద్యను నేర్పినపుడు ఆదైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు. జాగ్రత్త మేము కేవలం ఒక పరీక్షమాత్రమే, అవిశ్వాసానికి గురికాకు అయినప్పటికీ  వారు భార్యాభర్తలను వేరేచేసే  విద్యను ఆ దూతల వద్ద  నేర్చుకునేవారు. అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈవిధ్యద్వారా ఎవరికీ ఏమాత్రం హానికలిగించలేరనే విషయం సుస్పష్టం. కాని వారు నేర్చుకున్నది  వారికి నష్టం కలిగించేదే కానీ  లాభంకలిగించేది ఎంత మాత్రం కాదు. ఈవిద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం రికి బాగా తెలుసు.(అల్ బఖర- 102)

قَالَأَلْقُوافَلَمَّاأَلْقَوْاسَحَرُواأَعْيُنَالنَّاسِوَاسْتَرْهَبُوهُمْوَجَاءُوابِسِحْرٍعَظِيمٍ (الأعراف: 116).

)మూసా) అన్నాడు.. ముందు మీరే విసరండి.  వారు (తమకర్రలను) విసిరి, ప్రజల చూపులను మంత్ర ముగ్దం చేస్తూ వారికి భయం కలిగించే  ఒక అద్బుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించారు. (అల్ ఆర్ఫ్-116)

فَلَمَّاجَاءَالسَّحَرَةُقَالَلَهُمْمُوسَىأَلْقُوامَاأَنْتُمْمُلْقُونَ (يونس: 80).

మాంత్రికులు వచ్చిన తరువాత మూసావారితో మీరు విసరదలుచుకున్నవాటిని విసరండిఅని అన్నాడు(యూనుస్80)

وَأَلْقِمَافِييَمِينِكَتَلْقَفْمَاصَنَعُواإِنَّمَاصَنَعُواكَيْدُسَاحِرٍوَلاَيُفْلِحُالسَّاحِرُحَيْثُأَتَى (طه: 69).

  నీ కుడి చేతిలో ఉన్నదానిని విసురు  అది వారు కల్పించిన వాటిని మ్రింగివేస్తుంది. వారు కల్పించింది నిశ్చయంగా మాంత్రికుని తంత్రమే. మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటునుంచి, ఎలా వచ్చినాసరే. (తా హా  69)

وَمِنْشَرِّالنَّفَّاثَاتِفِيالْعُقَدِ    (الفلق: రియు ముడుపుల మీద  మంత్రించి ఊదేవారి కీడు నుండి    (అల్ ఫలఖ్4)

కాబట్టి , నీవు భూతవైద్యం నేర్చుకుంటూ నరకాగ్నికి చేరువయ్యే ఇలాంటి వారిని కొంతమందిని చూసినప్పుడు, వారు దీనిని హరామ్ గా భావిస్తున్నట్లు  గోచరిస్తుంది. కానీ నిజానికి భూతవైద్యం చేయటమనేది (కుఫ్ర్) అవిశ్వాసం. దీనివలన మనిషి పూర్తిగా ఇస్లాంపరిధి నుండిదూరమై పోయి అవిశ్వాసియైపోతాడు.  ఇక ఇందులో పూర్తిగా అన్నిరకాల విద్యలు నేర్చుకున్న వారు గానీ, పాక్షికంగా ఒకే ఒకటి నేర్చుకున్నాగానీ,  కేవలం భార్యభర్తలమధ్య ప్రేమను హెచ్చించచానికైనా, తగ్గించటానికైనా పూర్తిగా అవిశ్వాసులుగానే పరిగణించబడతారు.

ఈరకమైన అన్ని కార్యకలాపాలు కొన్ని తెలియని పదాల ద్వారా చేయబడతాయి. అది వారిని అవిశ్వాసానికి తోడుకుపోతుంది.  భూతవైద్యులకు విధించబడే శిక్ష  మరణం.  ఎందుకంటే  ఇది (కుఫ్ర్) కనుక.

మంత్ర తంత్రాలను గూర్చి ప్రవక్త(స) గారి ప్రవచనాలు ..

1."ఏడు మహాపాపాలను విసర్జించండి". అని చెపుతూ, భూతవైద్యం గురించి చెపుతూ.. "భూతవైద్యుని కత్తితో సంహరించండి" అని అన్నారు.

2.అలీ  బిన్ అబీ తాలిబ్ (రజి) ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు.... ముగ్గురికి స్వర్గప్రవేశం నిషేధం...1. త్రాగుబోతుకు 

2. కడుపులు పోగొట్టేవారికి  3. మంత్ర తంత్రాలను విశ్వసించేవారికి. (అహ్మద్)

3. అబూహురైరా(ర) ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు... ఎవరైతే ముడులు వేసి వాటిపై మంత్రించి ఊదే అభ్యాసం చేస్తాడో అలాంటి సహకారిగా ఉన్నాడు  అల్లాహ్ కు సహవర్తులను(షిర్క్) చేయటానికి సహకారిగా ఉన్నాడు. వారు దేనినైతే పొందాలని  శ్రమపడతారో అదివారికి లభించదు. (నసాయి) 

సహాబాల అభిప్రాయాలు

1.బిజాలా బిన్ అబాహ్ అన్నారు.. ఒకరోజు ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్(రజి) ఆయన చనిపోక ఒక సంవత్సరం ముందు మావద్దకు వచ్చారు. అప్పుడు ఇలా అన్నారు.. "ప్రతి భూతవైద్యుని (స్త్రీ అయినా పురుషుడైనా సరే) సంహరించండి"

2.వహబ్ బిన్ మునబ్బిహ్ అన్నారు.. "నేనొకపుస్తకంలో చదివాను, అందులో  అల్లాహ్ ఇలా అన్నాడు.." నేను తప్పమరొక దేవుడు లేడు. ఎవడైతే భూత వైద్యం చేస్తాడో వాడు, లేక ఇతరులను భూతవైద్యం చేయమని ప్రోత్సహించేవాడు, జ్యోతిష్యం చెప్పేవాడు, చెప్పించుకునేవాడు, శకునాలు చూసేవాడు, చూపించుకునేవాడు నావాడు కాడు."

3.అలీ బిన్ అబీ తాలిబ్ (రజి) అన్నారు..." జ్యోతిష్యం చెప్పేవాడు భూతవైద్యుడే, భూతవైద్యుడు అవిశ్వాసే".

4. అబూ మూసా అష్అరీ(రజి) ప్రవక్త(స) గారి ఒక ఉల్లేఖనాన్ని ఉల్లేఖించారు. 

"త్రాగుబోతు, బంధుత్వపు బంధాలను త్రెంచేవాడు, భూతవైద్యంపై నమ్మకం కలిగినవాడు స్వర్గంలో ప్రవేశించడు".

5. ఇబ్న్ మస్ఊద్ (రజి) ప్రకార ప్రవక్త(స) ఇలా బోధించారు.  "రుఖ్యా (స్వస్థతకొరకు చేసే),  తావీజులు,  రక్షరేకులు  షిర్క్ ''.

ఆలిమ్ ల అభిప్రాయాలు-

1. ఇబ్న్ ఖుదామా (రహ్మ్) తాళ్ళపై మంత్రించుట, రక్షరేకులు, అర్ధంకాని అక్షరాలు పలుకుట, వ్రాయుట, ఇతరుల శరీరాన్ని, లేక మనసును వశం చేసుకొనుటకు చేసే ప్రయత్నాలు, అలాగే ఇతరులపా ప్రభవం చూపే పనులు వారిని బాధించడం, లేక చంపడం, లేక భార్య భర్తలు రతిలో పాల్గొనేలా చేయటం, లేక విడదీసేలా చేయటం, వారికి ప్రేమకలిగేలా చేయటం లేక ప్రేమ లేకుండా చేయటం వగైరా వగైరా లన్నీ  భూతవైద్యం లేక మంత్రాల కోవలోకే వస్తాయి.  

2. ఇబ్న్ అల్ ఖయ్యిమ్(రహ్మ) ప్రకారం...

అ) చేతబడినుండి, మంత్ర విద్యనుండి రక్షించు కోవటానికి మంత్రవిధ్యనే ఉపయోగించడం కూడా షైతాను చేష్టే..

ఆ) ప్రవక్త(స) గారి విధానం ప్రకారం రుక్యా, లేక దుఆ, జిక్ర్ చేస్తే అది అమోదమే.

పై వాటిని షిర్కుగా ఎందుకు చెప్పబడిందంటే,  అజ్ఞానులు  అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత కంటే ఇవి బాగా పనిచేస్తాయని విశ్వసిస్తారు.

అల్ ఖత్తాబీ ప్రకారం రుఖ్యా ఇస్లాంలో అనుమతించబడింది. ఎలాగంటే, రుఖ్యాచేసేవారు ఖుర్ఆన్ చదివినా,లేక అల్లాహ్ పవిత్రనామాలతో దు'ఆ అడిగినా ఇది సమంజసమే. కానీ ఇవి గాక కొందరు తమ సొంత కవిత్వాలను వల్లించి అరుపులు కేకలు వేస్తారు అవి ఇక్కడ షిర్కుగా చెప్పబడింది.

ప్రవక్త(స) గారు రుఖ్యా చేసేవారు, ఒక సారి హసన్  మరియు హుసైన్ గార్ల కొరకు ఇలా రుఖ్యాచేశారు...

ఉఈజుకుమా బి కలిమాతిల్లాహి త్తామ్మతిన్,  మిన్ కుల్లి షైతానివ్వ హామ్మతిన్,వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మతిన్.(బుఖారి)

"ఓ అల్లాహ్ నీ పరిశుధ్ధ వాక్యాలద్వారా ప్రతి విధమైన చెడుచేసే షైతాన్, మృగములు, మరియు (చెడుచూపు)కనుదిష్టి నుండి వీరిని కాపాడుమని   నీశరణు వేడుతున్నాను."          

 ఇంకా ముస్లిములు షైతాన్ బారినుండి, దిష్టి, చేతబడి, భూత వైద్యం వంటి వాటినుండి రక్షించబడుటకు ఆక్రింది పద్దతులు పాటించుటకు అనుమతి ఉంది.

  1. ఆయతుల్ కుర్సీ పఠనం:-
  2. సూరాహ్ ఇఖ్లాస్,  అల్ ఫలక్, అన్ నాస్ ఫజర్ మరియు మగ్రిబ్ తరువాత 3 సార్లు పఠించుట.
  3. రాత్రి ప్రారంభంలో అల్ బకర సూరాహ్ చివరి (285-286) రెండు ఆయతులు చదువుట
  4.  అఊజుబి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ షర్రిమా ఖలఖ్ మరి యు అల్లాహ్ పవిత్ర నామాలతో జిక్ర్ చేయుట సాయం కాల సమయంలో 3సార్లు చదువుట 
  5. ఎవరనైనా షైతాన్ వేధిస్తుంటే 7 పచ్చని రేగుఆకులను బాగా దంచి  ఒక కుండలో నీరుపోసి , దంచిన రేగు ఆకులను నీటిలో కలిపేటపుడు ఆయతుల్ కుర్సీ, అల్ కాఫిరూన్, అల్ ఇఖ్లాస్ మరియు అల్ ఫలక్, అన్ నాస్ సూరాహ్ లను పటించాలి. అలాగే అల్ ఆరాఫ్ లో 117-119 ఆయతులు, సూరాహ్ యూనుస్ లో 79-82 ఆయతులు, అల్ బఖర లో 102 ఆయతు చదివి  ఆనీటిని  త్రాగించి, మిగిలిన నీటితో స్నానం చేయిస్తే అల్లాహ్ తలిస్తే అతనికి స్వస్థత కలుగుతుంది. అలా రెండు మీడుసార్లు గానీ రోగం తగ్గేవరకు గానీ చేయవచ్చు.
  6. మీకు చేతబడి ఏ వస్తువు ద్వారా చేసారో ఏప్రాంతంలో దానిని పాతిపెట్టారో కనుగొని దానిని నాశనం చేసినా దాని ప్రభావం పోతుంది.  అల్లాహ్  తలిస్తే వారికి స్వస్థతకలుగుతుంది. అల్లాహ్ అనుమతిలేకుండా ఏ విధమైన కష్టమూ, నష్టమూ మీకు సంభవించదని గుర్తించండి.               

  

Search Videos

Video Share RSS Module

Go to top