నమాజు చదవక పోవటం

(NOT PERFORMING THE  PRAYER)

 అల్లాహ్ నమాజు విషయంలో ఇలా సెలవిచ్చాడు...

فَخَلَفَمِنْبَعْدِهِمْخَلْفٌأَضَاعُواالصَّلاَةَوَاتَّبَعُواالشَّهَوَاتِفَسَوْفَيَلْقَوْنَغَيًّا (مريم: 59).
إِلاَّمَنْتَابَوَآمَنَوَعَمِلَصَالِحًافَأُوْلَئِكَيَدْخُلُونَالْجَنَّةَوَلاَيُظْلَمُونَشَيْئًا (مريم: 60).

  "వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనోవాంఛలను అనుసరించారు.  కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలేవారు  విశ్వసించి సత్కార్యాలు చేసేవారు  స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయంకూడా జరగదు."(అల్ మర్యమ్-59-60)

పైఆయత్ గురించి వివరిస్తూ ఇబ్న్ అబ్బాస్ (రజి) ఇలా అన్నారు....

అల్లాహ్ వారు నమాజును త్యజించారు అని ఇక్కడ పేర్కొన్నదాని భావం ఏమంటే వారు నమాజును దాని వేళలో పాటించలేదని అర్ధం.

సయీద్ ఇభ్న్ అల్ ముసయ్యిబ్, తాబయీన్ ల ఇమామ్(రహ్మ)ఇలా అన్నారు....ఎవరైతే జుహ్ర్ నమాజును అస్ర్ వరకు, అస్ర్ నమాజు మగ్రిబ్ వరకు , మగ్రిబ్ నమాజు ఇషా వరకు  ఇషా నమాజును ఫజ్ర్ వరకు,  ఫజ్ర్ సూర్యోదయం వరకు  పొడిగించి ఆలస్యంచేస్తారో  అలాంటివారు తౌబాచేయక, అలవాటును మార్చుకొనక అదే స్థితిలోగనకమరణిస్తే , అల్లాహ్ వారి ముఖాలను ఘయ్ (నాశనం) లో పడవేస్తాడు. ఘయ్య్ అంటే నరకంలో ఒక లోయ పేరు అది చాలాలోతైనది. ఎవరైతే అందులో పడవేయ బడతారో వారు భయంకరమైన శిక్షరుచి చూస్తారు.

మరోచోట ఇలా చెప్ప బడింది. తమ నమాజులపట్ల అశ్రధ్ధవహించేవారు  ప్రదర్శనా బుధ్దితో వ్యవహరించేవారు సర్వనాశనమవుతారు.

సఅద్ ఇబ్న్ అబీవక్కాస్(రజి) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త(స) ఈ ఆయతులోని  తమ నమాజులపట్ల  అశ్రధ్ధవహించేవారు అనే మాటకు అర్దం సమయంప్రకారం నమాజును చదవక పోవటమేనని  ఆయన వివరణ ఇచ్చారు. అలాగే వయ్ లు అనేమాటకు కఠిన శిక్షనీ, మరియు నరకంలోని ఒకలోయ యొక్క పేరనీ అన్నారు. ఈలోయ ఎలాంటిదంటే, ప్రపంచంలోని పర్వతా లన్నిం టినీ  ఈ  లోయలో పడవేస్తే దాని వేడికి అవి పిండిపిండి అయి పోతాయి. ఎవరైతే  తమ నమాజుల పట్ల అశ్రధ్ద వహిస్తారో వారు గనక తౌబా చేయకపోతే అలాంటి వారి గమ్యస్థానం అదే అని చెప్పారు.

يَاأَيُّهَاالَّذِينَآمَنُوالاَتُلْهِكُمْأَمْوَالُكُمْوَلاَأَوْلاَدُكُمْعَنْذِكْرِاللَّهِوَمَنْيَفْعَلْذَلِكَفَأُوْلَئِكَهُمْالْخَاسِرُونَ(المنافقون: 9).

"విశ్వాసులారా, మీ సిరి సంపదలూ, మీసంతానమూ మిమ్మల్ని అల్లాహ్ స్మరణనుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చబడతారో వారే నష్టానికి గురిఅయ్యేవారు".  (అల్ మునాఫికూన్ - 9) 

పైఆయతులోని అల్లాహ్ స్మరణ అనేమాటకు అర్దం 5ఫర్జ్ నమాజులని ఉలమాలు వ్యాఖ్యానించారు.  కావున ఎవరైనా తమ ఆస్థి, వ్యాపారం, జీవనాధారం, సంతానం కొరకు  నమాజులను నిర్లక్ష్యం చేస్తే వారు నష్టానికి గురిఅవుతారు.

ప్రవక్త(స) ఇలా అన్నారు.." తీర్పుదినాన మనిషికర్మలలో అన్నిటికంటేముందు నమాజును గురించి లెక్క అడగడం జరుగుతుంది."నమాజు ఆచరించినట్లయితే మంచిది, అతడు బాగుపడినట్లే, లేదా అతడునష్టపోక తప్పదు".(తిర్మిజి)

మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు...

مَاسَلَكَكُمْفِيسَقَرَ (المدثر: 42).قَالُوالَمْنَكُمِنَالْمُصَلِّينَ(المدثر: 43).وَلَمْنَكُنُطْعِمُالْمِسْكِينَ (المدثر: 44).
وَكُنَّانَخُوضُمَعَالْخَائِضِينَ(المدثر: 45)وَكُنَّانُكَذِّبُبِيَوْمِالدِّينِ(المدثر: 46).حَتَّىأَتَانَاالْيَقِينُ (المدثر: 47).

فَمَاتَنْفَعُهُمْشَفَاعَةُالشَّافِعِينَ(المدثر: 48).

"మిమ్మల్ని ఏవిషయం  నరకంలోనికి తీసుకువెళ్ళింది అని అడుగుతారు. దానికి వారు ఇలా అంటారు.  మేము నమాజును చేసేవారిలోనివారం కాము.  నిరుపేదలకు అన్నంపెట్టే వారము కాము. సత్యానికివ్యతిరేకంగా మాటలుకల్పించేవారితోపాటు కలిసి మేము కూడా మాటలను కల్పించేవారము. మరియు తీర్పు దినము అబద్దమని చెప్పేవారము. చివరకు ఆఅనివార్య విషయం మాకు ఎదురయింది. అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం పయోగపడదు."(అల్ ముద్దస్సిర్-42-48)

ప్రవక్త(స) అన్నారు....

1.  "మనకూ వారికీ మధ్యఉన్న ఒప్పందం నమాజ్ . ఎవరైతే దీనిని వదిలేస్తారో వారు కాఫిర్" (తిర్మిజి)

2"మనిషికీ కుఫ్ర్ కీ మధ్యగల వ్యత్యాసం కేవలం నమాజు మాత్రమే"  (ముస్లిం)

3.  "ఎవరైతే అస్ర్ నమాజును నిర్లక్ష్యం చేసాడో , వాని కర్మలన్నీవ్యర్ధమై పోయాయి.''(బుఖారి)

4."ఎవరైతే బుధ్ధిపూర్వకంగా నమాజులను నిర్లక్ష్యంచేశాడో వాడు అల్లాహ్ ఒప్పందంనుండి విడిపోయినట్లే"(అహ్మద్)

5.  ప్రజలు లాఇలాహఇల్లల్లాహ్,ముహమ్మద్ రసూలుల్లాహ్అని సాక్ష్యం పలికే వరకు, నమాజ్ స్థాపించి, జకాత్ ఇచ్చేవరకు వారితో పోరాడాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. వారు అలా చేస్తే వారి రక్తానికి ఆస్థులకు నానుండి రక్షణ లభిస్తుంది. కేవలం ఇస్లాం యొక్కహక్కుమాత్రమే వారిపై నిలిచి ఉంటుంది. వారి చివరి తీర్పు అల్లాహ్ చేతులలో ఉంది .  (బుఖారి)

6.  "ఎవరైతే తమ నమాజులను వేళప్రకారం పాటించారో, అలాంటి వారికొరకు  ఒకజ్యోతి ఇవ్వబడుతుంది. అది ఋజువులా, కఫ్ఫారాలా తీర్పుదినాన అతనికి ఉపయోగపడుతుంది. అలా చేయనివారికి తీర్పుదినాన ఫిర్ఔన్, ఖారూన్, హామాన్, ఉబైబిన్ ఖలఫ్ లతో లేపబడతారు". (దారిమి,అహ్మద్)

7. ఉమర్ (రజి)అన్నారు...' ఎవరైతే నమాజులను  నిర్లక్ష్యం చేశాడో అలాంటివాడు ఇస్లాం స్థంభానికిదూరమైపోయాడు(మాలిక్)

8.ముస్లిం విధ్వాంసుల అభిప్రాయం ప్రకారం... ఎవరైతే నమాజులను నిర్లక్ష్యంచేశారో..వారి నిర్లక్ష్యానికి కారణం వారి ఆస్తి, రాజ్యాధికారం, మంత్రిపదవి, వ్యాపారం అయితే,,, తీర్పుదినాన ఆస్థివలన నమాజులు వదిలిన వాడుఖారూన్ తో(28-76-82), రాజ్యాధికారం వలన నమాజులు వదిలిన వాడు ఫిర్ఔన్ తో, మంత్రిపదవి వలన వదిలిన వాడు హామాన్ తో(28-38), వ్యాపారంవలన నమాజులు వదిలినవాడు ఉబై బిన్ ఖలఫ్ తో కలిసి లేస్తారు.

9.ముఆజ్ బిన్ జబల్(రజి) ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు...

"బుధ్ధిపూర్వకంగా ఫర్జ్ నమాజు వదిలిన వాడు కాఫిర్ " (అహ్మద్)

10.ఉమర్ ఇబ్న్ అల్ కత్తాబ్ (రజి) అన్నారు...."ఒకడు వచ్చి ప్రవక్త(స) గారిని ఇలా అడిగాడు...ఓదైవప్రవక్తా...ఇస్లామ్ లో అల్లాహ్ బాగా ఇష్టపడే పనులేమిటి?  దానికి ఆయన (స)ఇలా అన్నారు....వేళకు నమాజు చేయటం, ఎవరైతే నమాజులను నిర్లక్ష్యం చేశాడో అతనివద్ద ధర్మమేలేదు. నమాజుకు ఇది (ధర్మం) పునాది".(బైహఖీ)

11. ఉమర్(రజి)ను అబూ లూలూ కత్తితో పొడిచినపుడు..ఆయన శరీరంనుండి  ధారాపాతంగా రక్తం ప్రసరిస్తున్నా, ఆస్థితిలోకూడా

"ఎవరైతే నమాజును విడిచిపెడతాడో వాడు కాఫిర్" అంటూనే తన నమాజును పూర్తి చేశారు.

12. హజ్రత్ అలీ(రజి)కి  ఒకస్త్రీ గురించిన సమాచారం అందింది  ఆమెనమాజులు ఆచరించేది కాదు దానికి ఆయన ఇలా అన్నారు.. "ఎవరైతే నమాజును నిర్లక్ష్యంచేశారో వారు అవిశ్వాసులే."

13. ఇబ్న్ మస్ఊద్(రజి)  "ఎవరైతే నమాజును చదవలేదో వారు అవిశ్వాసి" అని అన్నారు.,

14. ఇబ్న్ అబ్బాస్(రజి) ఇలా అన్నారు. "ఎవరైతే ఒకఫర్జ్ నమాజును బుధ్దిపూర్వకంగా విడిచిపెడతారో  అతను చనిపోతే అతనిపై అల్లాహ్ శాపం పడుతుంది.  ప్రవక్త (స) ఎవరైతే నమాజులను నిర్లక్ష్యంచేశారో,  అలాంటి వారి పుణ్యకార్యాలను  అల్లాహ్ లెక్కలోనికి తీసుకోడు."(అల్ ఘజాలీ)

15. ఇబ్న్ హజమ్ అన్నారు... "షిర్కు తర్వాత అత్యంత హేయమైన పాపం  నమాజు చదవక పోవడం, మరియు ధర్మమైన కారణం లేకుండా ముస్లిం ప్రాణంతీయటం.. ఇబ్రహీం అన్ నఖీకూడా అన్నారు , నమాజు విడిచినవాడు అవిశ్వాసి".

16. ఔస్ బిన్ అబ్దుల్లాహ్ (రజి) అన్నారు... "'దాసుడు సమాధిలో పెట్టబడిన తరువాత అతనిని మొట్ట మొదట  నమాజుగురించే అడగటం జరుగుతుంది.  అది గనుక అంగీకరించబడితే, మిగిలిన కర్మలు పరిశీలించబడతాయి.  అలా కాకుంటే, మిగిలిన కర్మలేవీ లెక్క తీసుకొనబడవు'".

17. రసూలుల్లాహ్ (స) అన్నారు.. "దాసుడు సమయం ప్రకారం నమాజు చదివితే , అది జ్యోతిమాదిరిగా  ఆకాశంలో తిరుగుతూ అర్ష్ వరకూ చేరుతుంది.  ఎవరైతే నమాజుచదివారో అతని మన్నింపు కొరకు తీర్పుదినం వరకు అది సిపారసు చేస్తుంది. ఇంకా ఇలా అంటుంది ఏవిధంగా నీవు నన్నుకాపాడావో, అలాగే అల్లాహ్ నిన్నుకాపాడుగాక !" . "మరెవరైతే వేళకు నమాజు చదవరో అలాంటివాని నమాజు చీకటితుట్టలా చుట్టబడి ఆకాశంవైపుకు వెళుతుంది. అక్కడ అది మురికి గుడ్డలా మారి దాసునిముఖం వైపు విసరివేయబడుతుంది. ఇలా అంటుంది.. నీవు నన్ను ఏవిదంగా విడిచిపెట్టావో అలాగే అల్లాహ్ కూడానిన్ను వదిలేయుగాక!"

18. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ఆస్ (రజి) ప్రవక్త (స)గారి హదీసును ఇలా తెలిపారు..

"అల్లాహ్ ముగ్గురు వ్యక్తులయొక్క నమాజులు అంగీకరించడు.  ఒకడు ప్రజలకు నాయకత్వం వహిస్తాడు కాని ప్రజలు అతనిని ఇష్టపడరు. సమయంమించిపోయిన తరువాత చేసేవారి నమాజ్. బానిసను ఒకసారి విముక్తిచేసిన తరువాత మరలా బానిసత్వంలోకి తీసుకున్నవాని నమాజ్". (అబూదావూద్, ఇబ్న్ మాజా)

19.  ప్రవక్త(స) అన్నారు .."షరీయత్ పరమైన అవాంతరాలు లేకుండా రెండు నమాజులను ఎవరైతే కలిపి చదువుతారో అలాంటివారు పెద్ద పాపం చేసినట్లే".

చిన్నపిల్లలకు నమాజ్ ఆదేశం ఎప్పటినుండి ఇవ్వాలి...

20.  రసూలుల్లాహ్ (స) అన్నారు ...

"పిల్లవానికి 7 సంవత్సరాల వయసురాగానే అతనికి నమాజ్ నేర్పండి. 10సంవత్సరాల వయసులో  నమాజ్ చదవకపోతే అతనిని శిక్షించండి". (తిర్మిజి, అబూదావూద్)          మరోచోట ఇలా చెప్పబడింది..."మీ పిల్లలు 7సంవత్సరాల వయసుకు చేరగానే నమాజ్ నేర్పండి.  10సంవత్సరాల వయసుకు చేరినపుడు నమాజ్ చదవకపోతే వారిని కొట్టండి. అలాగే 10సం,,లు నిండిన తరువాత పిల్లలను మీ పడకలనుండి వేరుగా ఉంచండి." (అబూదావూద్,అహ్మద్)

 ఇమామ్ సులైమాన్ అల్ ఖత్తాబ్ (ర)అన్నారు... పై హదీసు ప్రకారం...బాలుడు యవ్వన దశకు చేరికూడా నమాజుచదవక పోతే విధించవలసిన శిక్షను వివరిస్తుంది.  ఇమామ్ షాఫియీ(ర)గారి కొందరు శిష్యులు దీనిని ఒక ఋజువుగా చూపడం జరిగింది. వారి అభిప్రాయం ప్రకారం.. పిల్లలు చిన్నపిల్లలుగా ఉండి నమాజుచదవకపోతే కొట్టమని ఆజ్ఞఅయింది కనుక యవ్వన ప్రాయానికి చేరిన తరువాత వారు బుధ్ధి పూర్వకంగా నమాజును వదిలేస్తే చంపవచ్చు ఎందుకంటే, కొట్టడం తరువాత అంతకంటే మిగిలిన పెద్దశిక్ష చంపడమేకదా నని వారిఅభిప్రాయం.

 ఈవిషయంలో ఉలమాల మధ్య అభిప్రాయబేధాలున్నవి.మాలిక్, షాపియీ,అహ్మద్(రహ్మ)లు నమాజ్ వదిలేసిన వారిని చంపాలని అభిప్రాయపడిరి.  అలాగే నమాజు వదిలేసిన వానిని కాఫిర్ అని పిలవాలనే విషయంలోకూడా అబిప్రాయ బేధా లున్నాయి.  ఇబ్రహీమ్ నఖవీ, అస్సఖ్తియానీ, అబ్దుల్లాహ్ బిన్ ముబారక్, అహ్మద్ బిన్ హంబల్, ఇషాక్ బిన్ రహవ్యాహ్ మొ,,న వారు నమాజ్ వదిలేసిన వారిని కాఫిర్ అని పిలవాలని అన్నారు దానికి ప్రవక్త(స) గారి ఈహదీసును ఆధారంగా చెప్పారు..''వారికీ(కాఫిర్లకూ) మనకూ (ముస్లిములకూ) మధ్య భేదం కేవలం మనాజ్ మాత్రమే. నమాజు విడిచిన వాడు కాఫిర్''.

మరోచోట ..."మనిషికీ,  అవిశ్వాసానికీ మధ్యతారతమ్యం కేవలం నమాజ్ చదవకపోవటమే".

నమాజ్  చదువుట వలన లాభాలు

ఎవరైతే సమయం ప్రకారం నమాజును చదువుతారో  అలాంటివారికి అల్లాహ్ 5 గౌరవాలను ప్రసాదిస్తాడు.

1. ప్రపంచంలో ఆనందకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

2. సమాధి శిక్షనుండి విముక్తి చేస్తాడు.

3. కర్మల పత్రాన్ని కుడిచేతికి ఇస్తాడు(84-7)

4.పూల్ సిరాత్ ను  తేలికగా దాటేలా చేస్తాడు.

5.ఎలాంటి అభ్యంతరం లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.

నమాజ్ చదవక పోవుటవలన  నష్టాలు.

ఎవరైతే తమ నమాజులను నిర్లక్ష్యం చేస్తారో మరియు వేళకు చదవరో అలాంటివారికి 15రకాల శిక్షలు సంభవిస్తాయి.  అవి ..ప్రపంచంలో- 5,  మరణించేటపుడు- 3,  సమాధిలో-4, పునరుత్థానసమయంలో-3.

ప్రపంచంలో సంభవించే శిక్షలు- 5  అవి  1. అల్లాహ్ ఆశీర్వాదాలు, జీవితంలో ఎలాంటిమాధుర్యం ఉండదు.

2. అలాంటివారి ముఖంలో పుణ్యకాంతి కరువైపోతుంది.

3.అతని కార్యాలన్నీ వృధా అయిపోతాయి.

4.అతని ప్రార్దనలకు జవాబు దొరకదు.

5.అలాంటి వారి కొరకు పుణ్యాత్ములు ప్రార్ధించినా జవాబు దొరకదు.

మరణించేటపుడు సంభవించే శిక్షలు-3 అవి  1. విచారం, అసంతృప్తి కలిగిన స్థితిలో చావడం

2. ఆకలి, తీరని కోరికలతో చావడం,

3. దాహంతో(ధన,కనక,పదవి వంటి) చావడం.

సమాధిలో సంభవించే శిక్షలు -4

అవి 1.  అతనికి సమాది ఇరుకుచేయబడి ఎముకలు నలిగిపోతుంటాయి.

2. పగలూ, రాత్రి నరకాగ్ని జ్వాలలు అతనిని మాడుస్తుంటాయి.

3. విష పూరితమైన సర్పము రెండు కళ్ళలో నల్లని చుక్కలు కలిగి వాటితో అగ్ని కురిపిస్తూ భయంకర మైన ఇనుపగోళ్ళు కలిగి ఉంటుంది. దాని ఒక్కొక్కగోరుపై ప్రయాణంచేస్తే ఒకరోజు పడుతుంది. అది నమాజుచేయని వారిని ఉరుముల శబ్ధం వంటి అరుపుతో ఇలా అంటుంది... నేను  నున్నని తలగల మగ సర్పాన్ని  నా ప్రభువు నన్నుఎవరైతే నమాజును సమయంప్రకారం చదవకుండా నిర్లక్ష్యంచేస్తాడో మరియు ఆలస్యం చేస్తూ వచ్చారో వారిని శిక్షించుటకు సృష్టించబడ్డాను.

4. సర్పము ఎవరినైతే తన గోటితో కొడుతుందో వాడు 70గజాలు భూమిలో కూరుకు పోతాడు. తీర్పుదినం వరకు వాడు అలా భూమిలో దిగజారిపోతాడు.

పునరుత్థాన సమయంలో  సంభవించే శిక్షలు -3  సమాదినుండి లేపబడే రోజు అతని ముఖంపై ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 1. నీవు అల్లాహ్ హక్కులనునిర్లక్ష్యం చేశావు.

2. నీవు అల్లాహ్ శాపం పొందావు.

3. ప్రపంచంలో నీవు అల్లాహ్ హక్కులను నిర్లక్ష్యం చేసిన విధంగానే  ఈ రోజు అల్లాహ్ తన కారుణ్యంనీపై అనుగ్రహించుట  నిర్లక్ష్యం చేస్తున్నాడు (సుయూతీ దీనిని తప్పుడు హదీసుగా  పరిగణించాడు).

       ఇబ్న్అబ్బాస్ (రజి)అన్నారు,,, తీర్పుదినాన ఓవ్యక్తిని అల్లాహ్ ముందుకు తీసుకువస్తారు. అప్పుడు అల్లాహ్ అతనిని "అగ్నిలో పడవేయమని" ఆజ్ఞాపిస్తాడు.  ఆవ్యక్తి అల్లాహ్ ను ఇలా అడుగుతాడు ఓ "నాప్రభూ, ఎందుకు నాకీశిక్ష  అల్లాహ్ ఇలా అంటాడు. ఎందుకంటే,  నీవు నమాజులను వేళకు చేయకుండా నిర్లక్ష్యంచేసి, నాదృష్టిలో తప్పుచేశావు".

ఒకరోజు ప్రవక్త(స) తనశిష్యుల ముందు ఇలా అన్నారు...

"ఓ అల్లాహ్ మాలో ఎవరినీ దౌర్భాగ్యపుస్థితిలో, దరిద్రులుగా విడువకు". తరువాత ఆయన ఇలా అడిగారు మీకు తెలుసా దౌర్బాగ్యుడెవరో శిష్యులు అడిగారు ఎవరు దైవప్రవక్తా! అని, ఆయన(స) " ఎవడైతే నమాజులను నిర్లక్ష్యం చేస్తారో వాడే నని"  జవాబిచ్చారు.

రసూలుల్లాహ్ (స) అన్నారు....

"తీర్పుదినాన కొందరి ముఖాలు నల్లబడిపోతాయి.  అందరికంటే ముందు ఎవరైతే నమాజులను నిర్లక్ష్యం చేయుదురో  వారివే నల్లబడతాయి. నరకంలో ఒకలోయ ఉంది దానిపేరు అల్ మల్ హాం దానినిండా సర్పాలు, తేళ్ళు నిండిఉంటాయి. ప్రతి సర్పము బలిసిన ఒంటె మెడ అంత లావు ఉంటుంది. దాని పొడవు ఒకరోజు ప్రయాణమంత దూరం ఉంటుంది. అది ఎవరైతే నమాజులను నిర్లక్ష్యం చేయుదురో  వారిని కరుస్తుంది. దాని విషప్రభావం వలన  మనిషి శరీరం 7 సంవత్సరాలవరకు ఉడికిపోతూ ఉంటుంది. ఆతరువాత అతని శరీరం పగిలిపోయి చెల్లాచెదురైపోతుంది.'"(అల్ హాకిమ్)

ఒకసారి ఇస్రాయీల్ జాతికి చెందిన స్త్రీ మూసా(అ0 గారితో ఇలా అంది" ఓ దైవప్రవక్తా, నేను చాలా పెద్దపాపం చేశాను, తరువాత అల్లాహ్ ముందు తౌబా చేసుకున్నాను. కావున మీరు కూడా అల్లాహ్ నా తౌబా స్వీకరించాలని, నన్ను క్షమించుమని ప్రార్ధన చేయండి అని అడిగింది.  మూసా(అ)- నీవు చేసిన పాపం ఏమిటి? అని అడుగగా, ఆమె వ్యభిచారం చేశాను . తద్వారా నాకు బిడ్డపుట్టింది, ఆ బిడ్డనుకూడా చంపేశాను అని అంది. దానికి మూసా(అ) కోపంతో ఇలా అన్నారు...".ఓ దుష్టురాలా! పో!ఇక్కడినుండి లేకుంటే ఆకాశంనుండి నిప్పులవర్షం కురిసి మనలను దహించివేయవచ్చు. దానికి ఆ స్త్రీ ఎంతో నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది.  తరువాత జిబ్రీల్ (అ)వచ్చి,  ఓమూసా, అల్లాహ్ ఆ తౌబా చేసిన స్త్రీని ఎందుకు తిరస్కరించావని  నిన్ను అడుగుతున్నాడు. ఆ స్త్రీ కంటే ఘోరపాపం చేసిన వారిని నీవు చూడలేదా దానికి మూసా(అ)ఇలా అడిగాడు ఓ జిబ్రీల్ ఎవరా దుర్మార్గులు?  జిబ్రీల్ అన్నారు.  "ఎవరైతే బుధ్ధిపూర్వ కంగా నమాజులను నిర్లక్ష్యం చేస్తారో వారే".

నమాజు వినయ విధేయతలతో (ఖుషూ, ఖుజూలతో)పాటించాలి. అలా చేయనిచో ఏం జరుగుతుంది.

1. మసూద్ అల్ బద్రి ఇలా ఉల్లేఖనం ప్రకారం  ప్రవక్త(స)గారిలా అన్నారు...

'ఎవరిరుకూ,మరియు సజ్దాలలో ఎవరి వీపు సరిగా లేదో  వారి నమాజు అంగీకరించబడదు"(అహ్మద్).  కావున నమాజుచేసేవారు రుకూ, సజ్దా, మరియు కియామ్ చేసేటపుడు కొంతసేపు చలనం లేని స్థితిలో నిలకడ కలిగిఉండాలి.

2. ప్రవక్త(స)గారిలా అన్నారు....

"అతినీచుడైన దొంగ నమాజు దొంగ ఎవరో అడిగారు  అదెలాగ? అని.  దానికి ప్రవక్త(స)బదులిస్తూ..." ఎవరైతే రుకూ, సజ్దా, మరియు ఖిరాత్ సరిగా చేయరో వారే"  (అల్ దారిమి,అహ్మద్, అల్ హాకిమ్)

3. మరోచోట ప్రవక్త(స)ఇలా అన్నారు... "ఎవరైతే రుకూ, సజ్దాలలో  తమ నడుమును సరిగా వంచరో అలాంటి వారిని  అల్లాహ్ కన్నెత్తికూడా చూడడు". (అహ్మద్)

4. మునాఫిక్ నమాజ్ ఎలాఉంటుందంటే,,,"  అతడు సూర్యుడు అస్తమించే వరకు ఎదురు చూసి,  అప్పుడు నమాజు ప్రారంభించి త్వరత్వరగా పక్షి విత్తనాలు ఏరుకున్నట్లు  నమాజును త్వరత్వరగా ముగిస్తాడు. అతి తక్కువగా అల్లాహ్ ను స్మరిస్తాడు". (ముస్లిం)

5. అబ్దుల్లాహ్ అల్ అష్అరి ఉల్లేఖనం ఒకసారి ప్రవక్త(స)తమ శిష్యుల నమాజుకు ఇమామత్ చేశారు. నమాజు తరువాత ఒక వ్యక్తివచ్చి నమాజుచేశాడు. అతడు నమాజును చాలా త్వరత్వరగా ముగించేశాడు. ఇంకా రుకూ, సజ్దాలలో కూడా ఎక్కడా ప్రశాంతత కనబరచలేదు.  అప్పుడు ప్రవక్త(స) ఇలా అన్నారు - "వినండి .. ఇతడు ఇదే స్థితిలో గనక మరణిస్తే , ముహమ్మద్ ధర్మంపైగాక వేరేధర్మాన్ని  విశ్వసించిన వారిలో ఒకరిగా(కాఫిర్ గా) మరణిస్తాడు''.

6. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ (రజి) కథనం ప్రకారం... ప్రవక్త(స)ఇలా అన్నారు..

"నమాజ్ చేసే వ్యక్తికి కుడివైపున , ఎడమ వైపున రెండుదూతలు ఆవరిస్తాయి. అతడు నమాజుగనక  సరిగా ఆచరిస్తే, దానిని తీసుకొని అల్లాహ్ వద్దకుపోతాయి. సరిగా ఆచరించక పోతే  ఆనమాజును అతని ముఖంపైనే విసరి కొట్టిపోతాయి". (అద్ దారిఖుత్ని)

7. ఉబాదా బిన్ అస్సామిత్(రజి) కథనం ప్రకారం... ప్రవక్త(స)ఇలా అన్నారు.

"ఎవరైతే ఉజూసరిగా చేసి, నమాజుయొక్కప్రతి అంగాన్ని సరిగా పాటించి, రుకూ, సజ్దా, ఖిరాత్ చక్కగా పాటిస్తే, ఆనమాజ్ అంటుంది....".అల్లాహ్ నిన్నురక్షించుగాక, నీవు నన్నుకాపాడినరీతిగా", అప్పుడు అది ఆకాశానికి ఎత్తబడుతుంది. అక్కడ అది జ్యోతిగా మారి స్వర్గద్వారాలకు చేరుతుంది. అక్కడ దానికి ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడినుండి  అది అల్లాహ్ వద్దకు చేరుతుంది. అక్కడ అదినమాజు ఆచరించిన వ్యక్తికొరకు సిఫారసు చేస్తుంది. కానీ, ఎవరైతే ఉజూ సరిగా చేయరో, దాని అంగాలను, రుకూ, సజ్దా, ఖిరాత్ లను ఎవరైతే సరిగా పాటించరో,  ఆనమాజ్ నీవు నన్ నిర్లక్ష్యంచేసిన విధంగానే అల్లాహ్ నిన్నూ నిర్లక్ష్యం చేయుగాక అని శపిస్తుంది. తరువాత  అది చీకటిలా మారి ఆకాశానికి ఎత్తబడుతుంది దానికి స్వర్గద్వారాలు తెరుచుకోవు. కావున అది మసిగుడ్డలా చుట్టబడి  ఆనమాజ్ చేసేవారి ముఖంపైకి విసరివేయబడుతుంది."(అల్ హైతమి)

8. సల్మాన్ అల్ పార్శీ (రజి) ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు...

"నమాజ్ తూనిక వంటిది. ఎవరైతే సరైన కొలతనిస్తారో, అలాంటి వారికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది". ఎవరైతే  తగ్గించి ఇస్తారో  వారి కొరకు అల్లాహ్ ఏమన్నాడో చూడండి...

"తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి  వినాశం తప్పదు...". (అల్ ముతఫ్ఫిఫీన్-1)

"తగ్గించి ఇచ్చేవారెవరంటే?...  వస్తువులలో గానీ, నమాజులలో గానీ కొరత చేసేవారు.  అలాంటి వారిని  అల్లాహ్  వయ్ లు  శిక్ష విధిస్తానని హెచ్చరించాడు. అది నరకంలోని ఒకలోయ. అది స్వయంగా తన వేడినుంచి శరణు వేడుకుంటుంది.  మనంకూడా దీనిబారిన పడకుండా అల్లాహ్ శరణుకోరుకుందాం"

9. అబ్న్ అబ్బాస్ (రజి) ప్రకారం... ప్రవక్త(స) అన్నారు.

"ఎవరైతే సజ్దా చేస్తారో వారి నుదురు, ముక్కు,  అరచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళు మొత్తం 5శరీరభాగాలు  నేలకు ఆనించాలి.  ఇది అల్లాహ్  నాకు నేర్పిన పద్దతి.    అలాగే నేను వెంట్రుకలు, వస్త్రాలపై సజ్దా చేయరాదు.  కాబట్టి ఎవరైతే సరిగా సజ్దా చేయరో, ఏశరీరభాగమైతే నేలకు సరిగా ఆనించరో ఆభాగం  నమాజు పూర్తిఅయ్యేంత వరకు  అతనిని శపిస్తూ ఉంటుంది". (బుఖారి .,ముస్లిం)

10. ఇమామ్ అల్ బుఖారి, హుజైఫాబిన్ అల్ యమామ(రజి)గారి రివాయతును ఇలా ఉల్లేఖించిరి.

 హుజైఫా (రజి) ఒకసారి  ఒకాయన నమాజ్ చేస్తుండగా చూసాడు. అతడు రుకూ, సజ్దాలు సరిగా చేయలేదు".  ఆయన ఆ నమాజీతో ఇలా అన్నాడు.. "నీవు నమాజ్ సరిగా చేయలేదు. ఇదేస్థితిలో నీవు చనిపోతే, నీవు ముహమ్మద్ (స) ధర్మంపై గాక వేరే ధర్మంలో (కాపిర్ గా) మరణించినవాడివిఅవుతావు".

అబూదావూద్ లో ఒక రివాయత్ ఉంది అదికూడా పై హదీసుకు సంబందించినదే..  ఆయన(రజి) "నీవు ఎంతకాలం నుండి ఇలా నమాజుచేస్తున్నావని అడుగగా అతడు 40సంవత్సరాల నుండి అని బదులిచ్చాడు.  దానికి హుజైఫా(రజి)ఇలా అన్నారు... "నీవు 40సం,, లనుండి నమాజే చేయలేదు. ఇదే స్థితిలో నీవు మరణిస్తే, ముహమ్మద్(స) ధర్మంపైగాక వేరే ధర్మంలో మరణించిన వాడవు అవుతావు".     

నఫిల్ నమాజుల ఔన్నత్యం

అల్ హసన్ అల్ బస్రి(రహ్మ) ఇలా అనేవారు...     " ఓ ఆదమ్ కుమారుడా, నమాజ్ కంటే  నీధర్మంలో ప్రియమైనది  మరేముంది?.   తీర్పుదినాన అన్నిటి కంటే ముందు లెక్కచూడబడేది ఇదేకదా!

           ప్రవక్త(స) అన్నారు ..." తీర్పు దినాన అన్నిటి కంటె ముందు లెక్క చూడబడేది నమాజు గురించే. పరిశుద్దుడు, అత్యున్నతుడూ అయన నా  ప్రభువు  తన దూతలతో ఇలా అంటాడు.  'నాదాసుని నమాజు లెక్కచూడండి. అతడు దానిని పూర్తిగా ? ఆచరించాడా లేక అసంపూర్తిగా ఆచరించాడా?. అవి సంపూర్తిగా ఉంటే అతడు సాఫల్యంపొందినట్లే, ఒకవేళ అసంపూర్తిగా ఉంటే  నాదాసుడు చేసిన నఫిల్ ఆరాధనలేమైనా ఉన్నాయేమో చూడండి ? అంటాడు. అవి ఉంటే  పర్జ్ నమాజులకు బదులు నఫిల్ కలిపి ఆలెక్క పూర్తి చేయండి అంటాడు.   మిగిలిన ఆరాధనలలో కూడా ఇదేవిధంగా లెక్కచూడమని ఆజ్ఞాపించబడుతుంది. కావున మనం నఫిల్ ఆరాధనలు కూడా అధికంగా పాటిస్తూ ఉండాలి. అవి మనం తప్పిపోయిన ఫర్జ్ లకు ఉపయోగపడతాయి.

చేయగలిగే స్థోమత కలిగి కూడా ఎవరైతే ఫర్జ్ మరియు జమాఅత్ నమాజులను కోల్పోతారో వారి పర్యవసానం  ఏమిటి ?

అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు.

يَوْمَيُكْشَفُعَنْسَاقٍوَيُدْعَوْنَإِلَىالسُّجُودِفَلاَيَسْتَطِيعُونَ (القلم: 42).
خَاشِعَةًأَبْصَارُهُمْتَرْهَقُهُمْذِلَّةٌوَقَدْكَانُوايُدْعَوْنَإِلَىالسُّجُودِوَهُمْسَالِمُونَ (القلم: 43)

"కష్టకాలం దాపురించే రోజున  సజ్ దా చేయటానికి ప్రజలు పిలువబడతారు.  అప్పుడు వారు సజ్దా చేయ లేరు. వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి.  అవమానం వారిని ఆవరించి ఉంటుంది.  వారు నిక్షేపంగా ఉన్నకాలంలో  వారిని సజ్దా చేయండి అని పిలవటం జరిగేది(కాని వారు తిరస్కరించేవారు)"(అల్ ఖలమ్42-43)

సయీద్ ఇబ్న్ అల్ ముసయ్యబ్(రజి) ఇలా అన్నారు - 'వారు ఈప్రపంచంలో ఉన్నప్పటికీ వారు నమాజ్ కై పిలిచేవాని పిలుపుకు బదులిచ్చేవారు కాదు'.

ఇంకా కఅబ్ అల్ అహ్ బార్ అన్నారు..." అల్లాహ్ సాక్షి! ఈ ఆయత్ కేవలం జమాఅత్ నమాజులను విడిచి పెట్టే వారికొరకే అవతరించింది". నమాజ్ చేయగలిగే శక్తిఉండికూడా  నమాజ్ వదిలివేసే వారికొరకు ఎంత దౌర్భాగ్యకరమైన శిక్ష ఎదురుచూస్తుందో చూశారా..?

ప్రవక్త(స)అన్నారు... నాస్థానంలో ఇమామత్ కొరకు మరొకరిని నిలిపి, ఎవరైతే జమాఅత్ తో నమాజు  చేయుటకు రాలేదో, అలాంటివారి ఇండ్లకు నిప్పు అంటించాలని ఉంది .(బుఖారి ,ముస్లిం)

ఒకసారి ఓ అంధుడు ప్రవక్త(స)గారి వద్దకు వచ్చి, ఇలా విన్నవించుకున్నాడు.

"ఓ దైవప్రవక్తా!, నన్నుమస్జిద్ కు తీసుకురావటానికి సహాయకులెవ్వరూలేరు, కావున నేను ఇంటిలోనే నమాజ్ చేసుకోవటానికి అనుమతినివ్వండి". ప్రవక్త(స) దానికి అనుమతించారు.  కానీ ఆ అంధుడు కొంతదూరం పోగానే, ప్రవక్త(స) ఆఅంధుని వెనక్కిపిలిచి "నీకు అజాన్ పిలుపు వినిపిస్తుందా" అని అడిగారు . దానికతడు "వినిపిస్తుందని"  జవాబిచ్చాడు. అయితే "నీవు దానికి బదులివ్వాల్సిందే'(మస్జిద్ కు రావలసిందేనని) అన్నారు.

   ఒకసారి అమ్ర్ బిన్ మక్తూమ్ ప్రవక్త(స)గారి వద్దకు వచ్చి..

"ఓ దైవసందేశహరా!,  మదీనాలో మృగాలు, ప్రాకెడు జంతువులు ఉండేచోట నేను ఉంటున్నాను. నేను గ్రుడ్డివాడిని, నాకు దారిచూపే వారు కూడా ఎవరూ లేరు.  నేను ఇంటిలోనే నానమాజులు ఆచరించు కొనుటకు  అనుమతినివ్వండి" అనగా...దానికిప్రవక్త(స) "నీవు అజాన్ వింటున్నావా" అని అడిగారు. అందుకతడు "అవును వింటున్నాను" అని బదులిచ్చారు. అయితే "నీవు దానికి బదులు పలకవలసిందే. నేను నీకు అనుమతి నివ్వలేను" అనిఅన్నారు.(ముస్లిం)

     గ్రహించండి ! గ్రుడ్డివానికి, అనేక ఇబ్బందులు పడుతున్నవానికి,  దారిచూపేదిక్కులేని వారికి  కూడా ప్రవక్త(స) ఇంటివద్ద నమాజు చేసే అనుమతినివ్వలేదు,  మరి అన్నీ బాగుండి, ఏకారణమూలేకుండా మస్జిద్ కు రాని వారి పర్యవసానం ఏమిటి..?

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రజి)గారిని ఒకాయన అడిగారు... "ఒకాయన రోజంతా ఉపవాసం ఉంటాడు, రాత్రంతా నమాజులు చేస్తుంటాడు.  కాని అతడు జమాఅత్ నమాజులకు గానీ, జుమానమాజులకు గానీ హాజరుకాడు".అని చెప్పగా  అబ్బాస్(రజి) "అతడు గనక ఇలాగే చేస్తూ మరణిస్తే నరకానికి పోతాడు" అని బదులిచ్చారు.(తిర్మిజి)

అబూహురైర(రజి) ఇలా అన్నారు...." ఎవరైతే అజాన్ పిలుపు విని నమాజ్ కొరకు(రాడో) బదులుపలకడో, వాని చెవులలో కరిగించిన సీసం పోయడమే మంచిది".

ఇబ్న్ అబ్బాస్ (రజి)...  ప్రవక్త(స) గారి హదీసును ఇలా ఉల్లేఖించారు.

"ఎవరైతే అజాన్ విని షరీఅత్ పరమైన కారణం లేకుండా నమాజుకురాడో, (ఎవరో అడిగారు షరీఅత్ పరమైన కారణం అంటే ఏమిటి అనగా..  భయం, రోగం అని బదులిచ్చారు). అలాంటి వాని (ఇంటివద్ద ఒంటరిగా చేసే) నమాజ్ అంగీకారం కాదు".  (అబూదావూద్,అల్ హాకిమ్,ఇబ్న్ హిబ్బాన్)                                              

ఇబ్న్ అబ్బాస్ (రజి)గారి ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(స)ఇలా అన్నారు.

మూడురకాలవ్యక్తులను అల్లాహ్ శపించాడు. వారు..

1. ముఖ్తదీలు ఇష్టపడని ఇమామ్

2. భర్తకోరిక తీర్చకుండా అతనిని కోపానికి గురిచేసి రాత్రిగడిపే భార్య

3. అజాన్ విని నమాజుకు బదులివ్వని వ్యక్తి  (తిర్మిజి)

అలీబిన్ అబీ తాలిబ్(రజి)అన్నారు... "మస్జిద్ కు పొరుగున వుండేవాని నమాజ్ మస్జిద్ లో మాత్రమే

అంగీకరించబడుతుంది".    ఎవరో అడిగారు.. మస్జిద్ కు పొరుగువారంటే ఎవరు? అని,  అంటే "ఎవరైతే అజాన్ పిలుపు వినగలరో  వారంతా మస్జిద్ కు పొరుగువారే" అని బదులిచ్చారాయన.

బ్దుల్లాహ్ బిన్ మస్ఊద్(రజి)గారు , ప్రవక్త(స)గారి హదీసును ఇలా తెలిపారు.

"ఏ వ్యక్తి అయితే రేపు (తీర్పుదినాన) నిజమైన ముస్లిముగా  అల్లాహ్ ను కలుసుకోవాలని  ఆకాంక్షిస్తాడో..

అలాంటివ్యక్తి తన నమాజు పట్ల శ్రద్దవహించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము.  అల్లాహ్ కొన్ని కార్యాలను తన ప్రియదాసుడైన  ప్రవక్త(స)గారి ద్వారా మనకు పంపాడు. అలాగే ఈ నమాజులు కూడా వాటిలో కొన్ని  నమాజు చదవటం మంచిదే కాని చెడ్డదికాదు. అయినప్పటికిని, ఎవరైనా తమ నమాజు లను ఇళ్ళల్లో ఆచరిస్తున్నట్లయితే,  వారు ప్రవక్తగారి సాంప్రదాయాన్ని పాటించటానికి సిగ్గుపడుతున్నట్లో, లేక నిర్లక్ష్యంచేస్తున్నట్లో లెక్క.  కాబట్టి అలా చేస్తే నరకాగ్నికి పోతారు.  నేను చాలామందిని చూశాను. కేవలం మునాఫికులు మాత్రమే జమాఅత్ నమాజులలో వరుసలనుండి తప్పించుకునేవారు. కాని కొందరు బలహీన స్థితిలో లేదా రోగగ్రస్తస్థితిలో ఉండగా వారిని ఇద్దరేసి మనుష్యులు మోసుకొని తీసుకువచ్చేవారు.  వారు వరుసలలో నిలబడి నమాజ్ చదివేవారు.(ముస్లిం).

అర్ రబీ ఇబ్న్ ఖుతామ్ గారికి కాలుకి గాయం అయింది. ఆయన ఇద్దరు మనుష్యులను పట్టుకొని ఈడ్చుకుంటూమస్జిద్ కు వెళ్ళేవారు.  వారిలో కొందరు ఆయనకు ఇలాసలహా ఇచ్చారు.  "ఓ అబూ ముహమ్మద్, అల్లాహ్ షరీఅత్ పరమైన కారణం ఉన్నవారికి  ఇళ్ళలో నమాజుచదువుకొనే సౌకర్యం కలుగజేశాడు. కావున ఇంటిలోనే నమాజు చదువుకోండి" అని,  దానికాయన ఇలా బదులిచ్చాడు. మీరన్నది బాగానే ఉంది.  కానీ, నేను అజాన్ వింటున్నాను. ఎవరైతే అజాన్ వింటున్నారో వారు దేకుకుంటూ, ప్రాకుకుంటూనైనా సరే దానికి బదులివ్వటం ఎంతో ఉత్తమం.

హాతిమ్ అల్ అసమ్ అన్నాడు.  ఒక రోజు నేను జమాఅత్ తో చేసే ఫర్జ్ నమాజు పోగొట్టుకున్నాను. నాకు జమాఅత్ చేయించటానికి అబూ ఇస్హాఖ్ అల్ బుఖారి  తప్ప మరెవ్వరూ ముందుకురాలేదు. కానీ, నా బిడ్డలలో ఒకబిడ్డ చనిపోతే 10వేలమంది సానుభూతిచూపటానికి వచ్చారు. ఇది ధర్మానికి  ఒక పరీక్షా సమయం. ఎందుకంటే ప్రజలు ధర్మ విషయాలకంటే, ప్రాపంచిక విషయాలకే ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే  ధార్మికవిషయాలు  ప్రజలదృష్టిలో చాలా తేలిక.

పూర్వపు ముస్లిములలో ఒకాయన -- మన పాపాలవలననే  జమాత్ నమాజును కోల్పోతాము అని అన్నారు.  ఇబ్న్ ఉమర్(రజి)  ఇలా తెలిపారు..   ఒకసారి హజ్రత్ ఉమర్(రజి) ఒకతోటలో ఉన్నారు.. దానిని పరిశీలించి వచ్చేసరికి ప్రజలు అస్ర్ నమాజు పూర్తిచేసుకున్నారు.  దానికి ఆయన ఇలా అన్నారు..

ఇన్నాలిల్లాహి వఇన్నాఇలైహి రాజిఊన్, నేను అస్ర్ నమాజుకోల్పోయాను. మీరంతా సాక్ష్యంగా ఉండండి

      ఏ తోటవలన ఉమర్ నమాజు చెడిపోయిందో ఆతోటనే పరిహారంగా ,దానంగా పంచిపెట్టేస్తున్నాననిరి.

ఫజ్ర్ మరియు ఇషా నమాజుల విషయంలో మరింత శ్రధ్ధ కనబరచాలి.  ప్రవక్త(స)గారిలా అన్నారు.

మునాఫికులు ఫజ్ర్ మరియు ఇషానమాజు జమాఅత్ లలో బహు అరుదుగా కనిపిస్తారు.  ఈరెండు నమాజులకు లభించే పుణ్యపలం గురించి వారికి తెలిస్తే ప్రాకుకుంటూనైనా వారు తప్పక జమాఅత్ లో కలుస్తారు. (బుఖారి)

ఇబ్న్ ఉమర్(రజి) అన్నారు...ఏమనిషైనా ఈరెండు (ఫజ్ర్, ఇషా)జమాఅత్ నమాజులను పోగొట్టుకుంటే (చదవకపోతే) వారిని మునాఫిక్ గా పరిగణించవచ్చు.

ఉబైదుల్లాహ్  ఇబ్న్ అమ్ర్అల్ ఖవారిర్ అన్నారు... నేను ఎన్నడూ జమాత్  విడిచిపెట్టలేదు. ఒకరోజురాత్రి నోను ఓ కష్టంలో ఇరుక్కున్నాను. అందువల్ల  ఇషానమాజును జమాఅత్ తో చదవలేకపోయాను.  ఎలాగైనా సరే జమాత్ తో కలిసి నమాజ్ చేయాలని  బస్రా పట్టణమంతా  తరిగాను కానీ ఒక్కమస్జిద్ లోనూ జమాత్ లభించలేదు. నిరాసతో ఇంటికిచేరి హదీసు ప్రకారం చేయాలని నిర్ణయించుకొని(జమాత్ తో చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజుకన్నా 27రెట్లు అధికం) కావున నేను 27సార్లు నమాజు చేశాను. కలలో నేను నాగుర్రంపై స్వారీ చేస్తున్నాను. ఇంకాకొందరు వారి గుర్రాలపై స్వారిచేస్తున్నారు.  నాగుర్రం వారందరికంటే వెనుకబడిపోయింది.  ఎంత ప్రయత్నించినా వారిని చేరలేకపోయాను.  వారిలో ఒకతను నావైపుకు తిరిగి  నీవు నీగుర్రాన్ని కొట్టకు . నీవు ఎట్టిపరిస్థితిలోనూ మాతో చేరలేవు అన్నాడు . ఎందువలన అని నేను ప్రశ్నించాను. దానికతడు మేమంతా ఇషానమాజును జమాత్ తో ఆచరించాము, కానీ నీవు ఒంటరిగా ఆచరించావు, అందుకే మాతో సమానంకాలేవని అన్నాడు.... అదివిని నాకు చాలాబాధవేసింది.

ఇంకా అల్లాహ్ జిక్ర్ విడిచివేసే వారి పర్యవసానం ఎలా ఉంటుందో ఈ క్రింది ఆయతులలో కూడా చెప్పబడింది.

وَمَنْيَعْشُعَنْذِكْرِالرَّحْمَنِنُقَيِّضْلَهُشَيْطَانًافَهُوَلَهُقَرِينٌ(الزخرف: 36). وَإِنَّهُمْلَيَصُدُّونَهُمْعَنِالسَّبِيلِوَيَحْسَبُونَأَنَّهُمْمُهْتَدُونَ(الزخرف: 37). حَتَّىإِذَاجَاءَنَاقَالَيَالَيْتَبَيْنِيوَبَيْنَكَبُعْدَالْمَشْرِقَيْنِفَبِئْسَالْقَرِينُ(الزخرف: 38). وَلَنْيَنفَعَكُمُالْيَوْمَإِذْظَلَمْتُمْأَنَّكُمْفِيالْعَذَابِمُشْتَرِكُونَ(الزخرف: 39).

సూరాహ్ జుఖ్రుఫ్-36-39

మరియు కరుణామయుని స్మరణ విషయంలో  అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను  నియమిస్తాము.

ఇక వాడు (ఆషైతాన్) వాని సహచరుడు(స్నేహితుడు)అవుతాడు. మరియు నిశ్చయంగా  వారు (షైతాన్ లు) వారిని మార్గ భ్రష్టులను చేస్తారు. మరియు వారేమో  నిశ్చయంగా  తాము సరైన మార్గందర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు. చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు(తన వెంటఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు.. అయ్యో నాదౌర్భాగ్యం,  నీకూ నాకూ  మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంతబాగుండేది.  ఎందుకంటే నీవు అతిచెడ్డ సహచరుడివి.  మరియు మీరు దుర్మార్గం చేశారు. కావున  ఈరోజు మీరంతా  ఈ శిక్షలో  కలిసి ఉండటం మీకు ఏ విధంగానూ లాభదాయకం కాదు.

                                         

اسْتَحْوَذَعَلَيْهِمْالشَّيْطَانُفَأَنسَاهُمْذِكْرَاللَّهِأُوْلَئِكَحِزْبُالشَّيْطَانِأَلاَإِنَّحِزْبَالشَّيْطَانِهُمْالْخَاسِرُونَ(المجادلة: 19).إِنَّالَّذِينَيُحَادُّونَاللَّهَوَرَسُولَهُأُوْلَئِكَفِيالأَذَلِّينَ (المجادلة: 20).

 అల్ ముజాదలహ్19-20.

షైతాన్ వారిపై  ప్రాబల్యం పొందినందు వలన  వారిని అల్లాహ్ ధ్యానం నుండి  మరపింప జేశాడు. అలాంటి వారు షైతాన్ పక్షానికి చెందిన వారు.  జాగ్రత్త, షైతాన్ పక్షానికి చెందినవారే నిష్చయంగా నష్టపోయేవారు.   నిష్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో, అలాంటి వారే   పరమ నీచులు. 

అల్లాహ్ మనందరికీ  క్రమం తప్పక నమాజులు చదివే బుధ్ధిని ప్రసాదించు గాక !

Search Videos

Video Share RSS Module

Go to top