వడ్డీ (Riba)
సమస్త స్తుతులు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే చెందుతాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు అంతిమ ప్రవక్తయైన ముహమ్మద్(స)గారిపై సదా నిలిచియుండుగాక!.
దివ్యఖుర్ ఆన్ లో వడ్డీని తినేవారినుద్దేశ్యించి అల్లాహ్ ఈవిధముగా తెలిపాడు.....
సూరాహ్ అల్ బఖర 2-275-280
ٱلَّذِينَ يَأۡڪُلُونَ ٱلرِّبَوٰاْ لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ ٱلَّذِى يَتَخَبَّطُهُ ٱلشَّيۡطَـٰنُ مِنَ ٱلۡمَسِّ‌ۚ ذَٲلِكَ بِأَنَّهُمۡ قَالُوٓاْ إِنَّمَا ٱلۡبَيۡعُ مِثۡلُ ٱلرِّبَوٰاْ‌ۗ وَأَحَلَّ ٱللَّهُ ٱلۡبَيۡعَ وَحَرَّمَ ٱلرِّبَوٰاْ‌ۚ فَمَن جَآءَهُ ۥ مَوۡعِظَةٌ۬ مِّن رَّبِّهِۦ فَٱنتَهَىٰ فَلَهُ ۥ مَا سَلَفَ وَأَمۡرُهُ ۥۤ إِلَى ٱللَّهِ‌ۖ وَمَنۡ عَادَ فَأُوْلَـٰٓٮِٕكَ أَصۡحَـٰبُ ٱلنَّارِ‌ۖ هُمۡ فِيہَا خَـٰلِدُونَ (٢٧٥) يَمۡحَقُ ٱللَّهُ ٱلرِّبَوٰاْ وَيُرۡبِى ٱلصَّدَقَـٰتِ‌ۗ وَٱللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ (٢٧٦) إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَـٰتِ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَءَاتَوُاْ ٱلزَّڪَوٰةَ لَهُمۡ أَجۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ (٢٧٧) يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَذَرُواْ مَا بَقِىَ مِنَ ٱلرِّبَوٰٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ (٢٧٨) فَإِن لَّمۡ تَفۡعَلُواْ فَأۡذَنُواْ بِحَرۡبٍ۬ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ‌ۖ وَإِن تُبۡتُمۡ فَلَڪُمۡ رُءُوسُ أَمۡوَٲلِڪُمۡ لَا تَظۡلِمُونَ وَلَا تُظۡلَمُونَ (٢٧٩) وَإِن كَانَ ذُو عُسۡرَةٍ۬ فَنَظِرَةٌ إِلَىٰ مَيۡسَرَةٍ۬‌ۚ وَأَن تَصَدَّقُواْ خَيۡرٌ۬ لَّڪُمۡ‌ۖ إِن كُنتُمۡ تَعۡلَمُونَ (٢٨٠)
“వడ్డీ తినే వారి స్థితి షైతాను పట్టడం వలన ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణం ఏమిటంటే, ‘వ్యాపారం కూడా వడ్డీలాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం(హలాల్) చేశాడు. వడ్డీని నిషిధ్ధం(హరాం) చేశాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వట్టీతినడం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తరువాత మళ్ళీ ఈ దుశ్చర్యకు పాల్పడే వాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అదికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజు స్థాపించేవారికి జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయంకానీ, శోకంకానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి. ఇంకా మీరు అలా చెయ్యక పోతే మీపై అల్లాహ్ తరపునుండి యుధ్ధప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీని తినడం మానుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్దిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీకు మేలైనది.”

సూరాహ్ ఆలి ఇమ్రాన్-3-130

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لاَ تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُضَاعَفَةً وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ (آ“  
      విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినడం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం

పొందే అవకాశం ఉంది”.
సూరాహ్ అర్ రూమ్ 30-39
وَمَا آتَيْتُمْ مِنْ رِبًا لِيَرْبُوَا فِي أَمْوَالِ النَّاسِ فَلاَ يَرْبُوا عِنْدَ اللَّهِ وَمَا آتَيْتُمْ مِنْ زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُوْلَئِكَ هُمْ الْمُضْعِفُونَ ).
“ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు. అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో, మీరు ఇచ్చే జకాతు దానిని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృధ్ధి చేసుకుంటారు”.
దివ్యఖుర్ఆన్ లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తరువాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.

వడ్డీ అర్ధం-దాని పూర్వ రంగం-


వడ్డీని దివ్యఖుర్ఆన్ అరబీ భాషలో ‘రిబా’గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం’ లేక ‘అదనం’ అనే అర్ధాలు వస్తాయి. అరబ్బులు ఈపదాన్ని అధిక సొమ్ము అనేభావంలో వాడేవారు అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒకనిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చి దాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరికొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మననాట వడ్డీగా పిలుస్తాము.

వడ్డీ మూడురకాలు

1. The Usury of Excess అంటే అప్పుగా ధనం ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందటం వడ్డీ అవుతుంది.
2. The Usury of Hand- అంటే ఏదైనా వస్తువును అధికధరపై అరువుగా లేక వాయిదాల పద్దతిపై ఇవ్వటం.
3. The Usury of Exchange – అంటే ఏదైనా వస్తువు విషయంలో లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకవేళ వాటిలో హెచ్చు తగ్గులు చేస్తే అది వడ్డీ అవుతుంది. ఉదా- బంగారం, వెండి, గోధుమలు, ద్రాక్ష, ఖర్జూరం .
ముహమ్మద్(స) ప్రభవించక పూర్వం అరేబియా ప్రాంతంలో ఈపదం వ్యవహారంలో ఉంది కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు. ప్రజలు రిబా ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంధం అవతరించిన కాలంలో మూసా(అ) హయాంలో కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగించినపుడు అది హరాం గావించబడినదనే విషయం మనకు క్రింది ఆయతు ద్వారా బోధపడుతుంది.
సూరాహ్ అన్ నిసా 4-160-161
فَبِظُلْمٍ مِنْ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَنْ سَبِيلِ اللَّهِ كَثِيرًا ).
وَأَخْذِهِمْ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا (النساء:

“యూదుల ఈ దుర్మార్గ వైఖరివల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేదింపబడిన వడ్డీని తీసుకుంటున్నందు వల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందు వల్లనూ మేము వారికొరకు పూర్వం ధర్మసమ్మతములైన ఎన్నోపరిశుధ్దమైన వస్తువులను నిషిధ్దాలుగా చేసాము. వారిలో అవిశ్వాసు లుగా ఉన్నవారి కొరకు మేము వ్యధా భరితమైన శిక్షను సిధ్ధం చేసి ఉంచాము.”
అందుచేత అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. కావున రిబా సొమ్మును తినటం హరామ్ (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్ లో ఆజ్ఞ అవతరించినప్పుడు మహా ప్రవక్త (స) వడ్డీని గురించిన వివరాలను విడమరచి చెప్పవలసిన అవసరం ఏర్పడలేదు.
నేడు ఏవడ్డీ అయితే మానవ ఆర్ధికాంశానికి కీలకంగా భావించబడుతుందో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్దం. ఈ విషయంలో ద్వంద్వాబిప్రాయానికి తావులేదు. దీని నిషిధ్ధం గురించి 7 ఖుర్ఆన్ ఆయతులు , 40కి పైగా ప్రవక్త(స) హదీసులు సాక్షిగాఉన్నాయి. ముస్లింలలో చాలామంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులలో, దైవనామస్మరణలో గడుపు తారు, కాని తెల్లవారగానే తమవ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతిమరచిపోతారు. ఇది చాలా విచారించదగ్గ పరిణామం. వడ్డీగురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (స) చేసిన కొన్ని హెచ్చరికలను మీ ముందుంచుతున్నాము. చదవండి.
1. ఏడు ప్రాణాంతక విషయాల బారినుండి మిమ్మల్ని కాపాడుకోండి. అని దైవప్రవక్త(స)ఉపదేశించారు. అవేమిటి ఓ దైవప్రవక్తా!అని సహచరులు ప్రశ్నించగా, ఆయన (స) ఇలా వివరించారు.. 1. ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం 2. చేతబడి (బాణామతి) చేయటం 3. ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చటం 4. వడ్డీతినడం. 5. అనాధసొమ్మును తినడం 6. ధర్మయుధ్ధం సమయంలో యుధ్ధరంగంనుండి పారిపోవడం.

7. సౌశీల్యవతులైన మహిళలపై అపనిందలు వేయడం. (బుఖారి-ముస్లిం)
2. అంతిమ దైవ ప్రవక్త(స) ఇలా తెలిపారు. ఈరోజు రాత్రి నేను నాదగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మక్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒకమనిషి నిలబడి ఉన్నాడు. మరొకతడు కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వు తున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపు ఉన్న చోటికే పరుగెడుతున్నాడు. మళ్ళీ అతడు కాలువ నుంచి బయటపడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్ళీ రాయి రువ్వ సాగు తున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట ఉన్న వారిని ప్రశ్నించగా కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు(ఇప్పుడు తన కర్మకు శిక్షననుభవిస్తున్నాడు) అని వాళ్ళు బదులిచ్చారు(బుఖారి)
3. దైవప్రవక్త(స) వడ్డీతీసుకునేవారినీ, వడ్డీ ఇచ్చేవారిని శపించారు. మరి కొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారంపై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులను వ్రాసేవారిని కూడా శపించారు. సహీ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది. వీళ్లంతా ఈ పాపంలో సమాన భాగస్తులే. మరికొన్ని చోట్ల సాక్షులు, దస్తావేజులు, వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే శాపానికి గురిఅవుతారు అని చెప్పబడింది.
4. మహాప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా బోధించారు... నాలుగు రకాల మనుషులున్నారు.. వారికి స్వర్గంలో ప్రవేశం లబించదు గాక లభించదని అల్లాహ్ ఖశ్చింతగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే.....
1. మద్యపానానికి అలవాటు పడినవాడు. 2. వడ్డీని తిన్నవాడు. 3. అనాధల సొమ్మును అన్యాయంగా స్వాహా చేసినవాడు 4. తల్లిదండ్రుల మాట విననివాడు. (ముస్తద్రిక్ హాకిమ్)
5. మహనీయ ముహమ్మద్(స) ఇలా ప్రవచించారు.....వడ్డీతో కూడిన ఒక్కదిర్హమ్ తిన్నవాడు ముప్పయి ఆరు సార్లు వ్యభిచారం చేసిన దానికన్న ఎక్కువపాపం చేసినట్లు లెక్క. మరొక ఉల్లేఖనంలో అక్రమ ధనంతో పెరిగిన కండలకోసం అగ్నియే సరియైనది. దాంతో పాటు మరో చోట ఇలా ఉంది.. ఒక ముస్లిం మానమర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినడం కన్నా ఎక్కువ పాపిష్టికరం (ముస్నద్ అహ్మద్)
6 ముహమ్మద్(స) ఇలా బోధించారు... (వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాకముందే దాన్ని అమ్మి వేయాలి. ఇంకా ఇలాఅన్నారు.. ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీవ్యాపారం పెరిగిపోతే అది దైవాగ్రహాన్ని తనపైకి ఆహ్వానించినట్లే. (ముస్తద్రక్ హాకిమ్)
1. ప్రవక్త(స)అన్నారు...ఏజాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తుల ధరను విపరీతం చేస్తాడు. మరేజాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది. (ముస్నద్ అహ్మద్)
2. దైవప్రవక్త(స) ఇలా వివరించారు. మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నాపైన ఒక మెరుపు మెరవటం చూశాను. ఆతరువాత మాకు ఒక జనసమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాసగృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిలో సర్పాలు నిండిఉన్నాయి. అవి బయటకు కనిపిస్తున్నాయి. ఎవరు వీరు? అని నేను దైవదూత జిబ్రీల్(అ)ను అడిగాను.. వీళ్ళు వడ్డీ సొమ్ము తిన్నవారు అని ఆయన సమాదానమిచ్చారు (ముస్నద్ అహ్మద్)
3. దైవప్రవక్త(స) ఔఫ్ బిన్ మాలిక్(రజి) ఉద్దేశించి చెప్పారు...క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి... యుధ్ధప్రాప్తిని తస్కరించుట రెండు-వడ్డీ సొమ్మను తినుట (తబ్రానీ)
4. దైవప్రవక్త(స) ఇంకా ఇలా ఉపదేశించారు... మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి. (బహుశా అతను ఈకానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో జాగ్రత్తపడడం మంచిది.)
5. వడ్డీలో 70 రకాల పాపాలున్నాయి. వీటిలో అన్నిటికంటే చిన్నపాపం – తల్లితో వ్యభిచరించిన దానికి సమానం.
అన్నిటికంటే అసహ్యకరమైనది తన సోదరుని అవమాన పరచటం. (అల్ హైతమి, మజ్మా అల్ జవాయిద్)


వడ్డీయొక్క ఆధ్యాత్మిక అనర్ధాలు
1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృస్వభావం స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం.
అయితే వడ్డీ పిశాచం తిష్టవేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదుకదా పరులుకష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒకవడ్డీ వ్యాపారి సహించలేడు.


2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్ధ ప్రయోజనాలకై సొమ్ముచేసుకో జూస్తాడు.


3. వడ్డీ ఆర్జనవల్ల అతనిలో పేరాస పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటు మాయ మవుతాయి. మంచీ చెడుల మధ్యగల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆవిధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికి దూరమైపోతాడు.


పరిష్కారం
1. ప్రవక్త(స)అన్నారు...ఎవరైతే తన ప్రార్ధనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న బాకీ దారునికి మరింత గడువు ఇవ్వాలి.


2. ఎవరైతే ఒక పేదరుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతిరోజు అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒకగడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే, అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానం ఇచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది. (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)

అల్లాహ్ మనందరినీ వడ్డీ అలవాటునుండి రక్షించుగాక !
తెలియక మనజీవితాల్లో నేటివరకు జరిగిన పాపాలను మన్నించుగాక,!
వడ్డీని సమూలంగా మన జీవితాలనుండి దూరపరచి మనల్ని పరిశుధ్ధ పరచుగాక.!...ఆమీన్. !!!

Search Videos

Video Share RSS Module

Go to top