Aqeeda

నమాజు చదవక పోవటం

(NOT PERFORMING THE  PRAYER)

 అల్లాహ్ నమాజు విషయంలో ఇలా సెలవిచ్చాడు...

فَخَلَفَمِنْبَعْدِهِمْخَلْفٌأَضَاعُواالصَّلاَةَوَاتَّبَعُواالشَّهَوَاتِفَسَوْفَيَلْقَوْنَغَيًّا (مريم: 59).
إِلاَّمَنْتَابَوَآمَنَوَعَمِلَصَالِحًافَأُوْلَئِكَيَدْخُلُونَالْجَنَّةَوَلاَيُظْلَمُونَشَيْئًا (مريم: 60).

  "వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనోవాంఛలను అనుసరించారు.  కనుక వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలేవారు  విశ్వసించి సత్కార్యాలు చేసేవారు  స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయంకూడా జరగదు."(అల్ మర్యమ్-59-60)

పైఆయత్ గురించి వివరిస్తూ ఇబ్న్ అబ్బాస్ (రజి) ఇలా అన్నారు....

భూత వైద్యం చేయుట

)Sorcery(

భూతవైద్యం చేయుట మహాపాపం.  ఎందుకంటే భూతవైద్యం చేసే వారు తప్పనిసరిగా అవిశ్వాసులై తీరాలి. మరియు శాపగ్రస్తుడైన షైతాన్ కు కూడా ఒక మనిషికి అవిశ్వాసం, విగ్రహారాధన నేర్పించి,  దైవ వ్యతిరేకులుగా తయారు చేయాలనే ఆలోచనతప్ప మరొకటి ఉండదు. అందువలన భూతవైద్యం మరియు దానికి సంబంధించిన మంత్ర, తంత్ర, జాల విద్యలన్నీ షైతాన్ క్రియలుగానే పరిగణించబడతాయి. ఇవి పూర్తిగా షైతాన్ సంబంధిత మాయాజాలం. ఇందులో అబద్దాలే అధికం. మానవులను పెడత్రోవ పట్టించే పనులు, మానవ వినాశనానికి , మానవ అశాంతికి గురిచేసే ఈ క్రియలన్నీ పాపాలే. కావున అల్లాహ్ ఇలాంటి పనులన్నింటినీ అసహ్యించుకుంటాడు.

నరహత్యచేయుట

(KILLING A HUMAN BEING)

నరహత్య మహా పాపాము. ఇస్లాం  శాంతిని భోధించే ధర్మం. దైవం మానవులకు పరస్పర సోదరభావం కలిగిఉండాలని, మానవులంతా కలిసి మెలసి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిహక్కులను మరొకరు కబళించకుండా న్యాయబద్దమైన జీవితంగడపాలని బోధించాడు. ఒకవేళ సమాజాన్ని అశాంతికి గురిచేసే, ధన, మాన, ప్రాణాలకు ముప్పుకలిగించే  ముష్కరులు తారసపడితే వారిని చట్టప్రకారం శిక్షించాలే గాని వ్యక్తిగతంగా అసూయాద్వేషాలతో ఒకరినొకరు చంపుకోవటాన్ని ఇస్లాం ఎంతమాత్రమూ అంగీకరించదు.

      మహా పాపాలు  

 ( MAJOR SINS)

 

నిర్వచనము:-  ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స) నిషేధించిన మహాపాపాలు ఏమిటో పూర్వపు ముస్లిములు నిర్వచించారు. అల్లాహ్ త'ఆలా కూడా మహాపాపాలకు దూరంగా ఉండేవారి చిన్నచిన్న పాపాలను తుడిచివేస్తానని వాగ్ధానం చేశాడు.  కావున ప్రతి ముస్లిం పరిశుధ్ధమైన, నీతినిబంధనలతో కూడిన జీవనవిధానాన్ని అవలంభించాలి. బాల్యంనుండి క్రమశిక్షణతో కూడిన నైతిక జీవితాన్నిఅలవరచుకోవాలి. అల్లాహ్ ఆరాధనతోపాటు ప్రతివిధమైన పాపాలకు దూరంగా ఉండాలి. మానవ తప్పిదాలు సహజం.  అలాగే అసంకల్పితంగా జరిగే పాపాలు కూడా కొన్నిఉంటాయి.  అలాంటి వాటిని క్షమాదాత అయిన తన మహా కారుణ్యంతో క్షమించి వేస్తానని మానవాళికి వాగ్ధానం చేసాడు. చూడండి  అల్లాహ్ ఏమన్నాడో.....

అల్లాహ్ కు సహవర్తులను (షిర్కు చేయుట) కల్పించుట.

Ascribing Associates to Allah, the Most High(Shirk).

అరబీ భాషలో షిర్కు అనగా ఒకే ఒక్కదేవుడైన అల్లాహ్ నుగాక ఇతరులను దైవంగా భావించి, అల్లాహ్ యేతరులను ఆరాధించుట. దైవత్వంలో అల్లాహ్ కు సమానంగా దేవతలను, ప్రవక్తలను, మానవులను, సూర్య, చంద్రులవంటి సృష్చిరాశులను, జంతువులను, రాళ్ళను, విగ్రహాలను పూజించుట. ఇంకా అల్లాహ్ ను ఆరాధించి పొందగలిగే మేళ్ళను, శుభాలను ఇతరులను పూజించి పొందగలమని భావించుట. పూజించుటలో, కీర్తించుటలో, మొరపెట్టు కొనుటలో,మ్రొక్కుకొనుటలో,అల్లాహ్ కు భాగస్వాములున్నారని భావించుట. అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా ఇతరులను ప్రేమించుట,  అల్లాహ్ కు భయపడ వలసిన విధంగా ఇతరులకు భయంపడటం, అవసరాలు తీర్చే శక్తి,  ఆపదలో ఆదుకునే శక్తి, సంపద, సంతానం ప్రసాదించే శక్తి అల్లాహ్ కుగాక ఇతరులకు కలవని నమ్మటం.

Search Videos

Video Share RSS Module

Go to top