విజ్ఞానం

అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

వరుసక్రమం, ముఖ్యంగా భవిష్య ఘటనల విషయంలో మరీ అంత ఖచ్ఛితంగా ఉండవలసిన అవసరం లేకపోయినా, కాలక్రమానుసారమే ప్రళయ దిన చిహ్నాలు దాదాపుగా పేర్కొనబడినాయి.

ప్రళయదిన చిహ్నాల సంక్షిప్త సారాంశమిది; వీటిని సవివరంగా చర్చిస్తున్న అనేక పుస్తకాలు, వ్యాసాలు, క్యాసెట్టులు అందుబాటులో ఉన్నాయి. అల్లాహ్ మమ్ముల్ని వాటిని గుర్తించేలా మరియు జాగ్రత్త పడేలా చేయుగాక మరియు ఆపద సమయాలలో మాకు శక్తినివ్వుగాక.

فَهَلۡ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأۡتِيَہُم بَغۡتَةً۬‌ۖ فَقَدۡ جَآءَ أَشۡرَاطُهَا‌ۚ فَأَنَّىٰ لَهُمۡ إِذَا جَآءَتۡہُمۡ ذِكۡرَٮٰهُمۡ

హఠాత్తుగా వారి వద్దకు వచ్చే అంతిమ ఘడియ గురించి గాక, వారు దేని గురించైనా నిరీక్షిస్తున్నారా? అయితే వాటి చిహ్నాలు ఇప్పటికే వచ్చేసాయి!” (సూరహ్ ముహమ్మద్ 47:18)

కమ్యూనిజంకంటే ఉన్నతమైన వ్యవస్థ

Islam is better than Communism

       పెట్టుబడిదారీ వ్యవస్థ వెన్నెముకను విరిచే సిద్ధాంతాలు రెండు ఒకటి కమ్యూనిజం, రెండోది ఇస్లాం.
ఇక్కడ (భారత దేశంలోని) కమ్యూనిస్టుల్లో కొంతమంది మాత్రమే దాస్‌ కాపిటల్‌ను లోతుగా అధ్యయనం చేసి ఉంటారు. మార్క్స్‌ సిద్ధాంతాలలో మిగులు విలువ’  అన్నదొకటి. ఈ సూత్రాన్ని మార్క్స్‌ మూడు గ్రంథాల్లో విశదీకరించాడు.
పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు. శ్రామికుడు తన శ్రమతో ఆ పెట్టుబడికి లాభం చేకూరుస్తాడు. ఈ లాభం అసలు మూల ధనం కంటే అధికంగా ఉంటుంది. ఈ అధికాదాయంతో పెట్టుబడిదారుడు మరో ప్యాక్టరీ స్థాపనకు పూనుకుంటాడు. ఈ విధంగా అతడు సామాన్యుల్ని దోచుకుంటాడు- ఇదీ కమ్యూనిజం వాదన, ఈ స్థితిలో కమ్యూనిజం రంగప్రవేశం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు అసలు బలమైన ఈ మిగులు విలువను అంతమొందించగోరుతుంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థను తుదముట్టించి ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయం చేసుకుంటుంది.
పరిశ్రమలను జాతీయం చేయడం వల్ల సమస్య పరిష్కృత మవుతుందా? అన్నది ఆలోచించవలసిన విషయం. జాతీయం చేయబడిన పరిశ్రమల నుండి కూడా మిగులు విలువ ఉత్పన్నమవుతుంది. ఈ లాభాన్ని ఎటు తరలించాలన్నది ప్రశ్న. నేడు ఆచరణాత్మకంగా ఈ లాభం ఏమవుతుంది అన్నదాన్ని కూడా చూడాలి. 

ఆరాధన పరమార్థం

Purpose of Worship

‘‘నీవు మంచిని గురించి ఆజ్ఞాపించు, చెడును నివారించు లేదా అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించు లేదా బాధితునికి సహాయపడు లేదా మార్గమధ్యంలో పడివున్న హానికర వస్తువును దూరం చెయ్యి’’

ఇస్లాంలో ఆరాధన ఉద్దేశ్యం చాలా విస్తృతమైనది. నమాజ్, రోజా, జకాత్, హజ్‌లతోపాటు నిత్యజీవితంలో ఆచరించబడే ఆచరణలు కూడా ఆరాధనలో భాగమేనని ప్రకటించింది. మనిషి తన స్వప్రయోజనంకోసం, ఇతరుల మంచికోసం ఆచరణలు చేస్తాడు. ఈ ఆచరణలు చిత్తశుద్ధితో దైవప్రసన్నతకోసం, దైవ సామీప్యాన్ని పొందే సంకల్పంతో చేస్తే, అవి చిన్న ఆచరణలైనా కొండంత పుణ్యాన్ని కూడపెడతాయి. సామూహిక ప్రయోజనం చేకూర్చే ప్రతి ఆచరణను ఇస్లాం ఉత్తమ ఆదరణ అని పేర్కొంది.

అర్థం చేసుకోవాలి; అపార్థం కాదు!

Don’t Misunderstand

భారతదేశం వైపు సృష్టికర్త యొక్క ఏ దివ్యసందేశం పంపబడింది, వేదాలను మరియు హిందూ ధర్మ దివ్యగ్రంథాలను మనం సృష్టికర్త యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా లేదా?” అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో భారతదేశం వైపు పంపబడిన దివ్యసందేశం పేరు తెలిపే ఒక్క వచనం కూడా పేర్కొనబడలేదు. వేదాల మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాల పేర్లు ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో ఎక్కడా పేర్కొనబడక పోవటం వలన, ఖచ్ఛితంగా అవి కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలే అని ఎవ్వరూ చెప్పలేరు. అవి సృష్టికర్త యొక్క దివ్యసందేశాలు కావచ్చు, కాకపోవచ్చు.

ప్రశ్న : ముస్లింలు, ముస్లిమేతరుల్ని కాఫిర్అనే చెడ్డ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జవాబు : కాఫిర్అనే పదానికి అర్ధం నిరాకరించేవాడు :
కాఫిర్అనేది అరబ్బీ భాషలోని కుఫర్అనే పదంతో ఏర్పడింది .

కూఫ్ర్అంటే దాచేయటం లేక నిరాకరించటం అని అర్ధం. ఇస్లామియా పరిభాషలో ఇస్లాం సత్యతను, దాని వాస్తవికతను దాచేసే లేక నిరాకరించే వ్యక్తి కాఫిర్అనబడతాడు. ఆంగ్లంలో ఈ నిరాకరించే వ్యక్తి కోసం (ముస్లిమేతరుడు) non muslim అనే పదం వాడుకలో ఉంది.

ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలామ్

ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం జీవిత చరిత్ర - క్లుప్తంగా

ప్రభువు వైపుకు మరలండి!

మనం ప్రభువు వైపుకు ఎందుకు మరల వలెను? అనే ముఖ్యవిషయం ఇక్కడ విపులంగా వివరించబడినది.

ఇస్లాం పరిచయం

ఇస్లాం ధర్మం గురించి సరళమైన భాషలో వివరిస్తున్నది. మానవసృష్టికి కారణాలు, సృష్టికర్త యొక్క హక్కులు, మానవుడు జీవితంలో ఆచరించవలసిన ప్రధానమైన పనులు, మరణించిన ఎదుర్కొనబోయే పరిణామాలు తెలుపు తున్నది. ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర ధర్మగ్రంథాలలోని ఆధారాలు కూడా ప్రస్తావించబడినది.

 

అపనిందలు వేయటం నిషేధించబడినది

ఇతరులపై అపనిందలు వేయటం ఎంత పాపమో ఈ హదీథ్ లో ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధనల ద్వారా తెలుసుకోగలరు.

 

వస్త్రధారణ నియమాలు

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన వస్త్రధారణ నియమాల గురించి చర్చించినారు.

ఇరుగు పొరుగు వారి హక్కులు

ఇరుగు పొరుగువారి హక్కుల గురించి ఈ హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశించారు.

 

ముహర్రం నెల-( యౌమే అషూరా) 

ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ముహర్రం మాసం గురించి, అషూరహ్ ఉపవాస ప్రాధాన్యత గురించి మరియు కొన్ని అప్రామాణికమైన నూతన కల్పితాచరణల గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా స్పష్టంగా వివరించినారు.

 

 

Search Videos

Video Share RSS Module

Go to top