ముస్లిం మహిళ

ఇస్లాం ధర్మంలో స్త్రీలకు పరదా ఎందుకు?


ఇస్లాం స్త్రీలను పరదా వెనుకను నెట్టివారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలులేకుండా చేసిందా ? ఇస్లాం స్త్రీలకు స్వేచ్ఛలేకుండా చేసిందిఅన్నది నిరాధారమైన ఆరోపణ మత్రమే . ఇస్లాంకు పూర్వం గురించి తెలియని వారు అన్నమాటలుమాత్రమే . స్త్రీలకు పరదా ఎంతో అవసరo . పరదా వేసుకోవటంలో ముఖ్యఉద్దేశం ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లాలంకుముందు ప్రపంచంలో వివిధ దేశాలలో స్త్రీల పరిస్థితి గురించి తెలుసుకుందాం.

ఇస్లాం ధర్మంలో స్త్రీ

 

         ముహమ్మద్ ప్రవక్త (స) ప్రభవనకు పూర్వం సమాజం ఎలా ఉండేదో ఊహిస్తే ఒళ్లు జలదరిస్తుంది. అజ్ఞానాంధకార విష వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమాజమది. ‘కర్రగల వాడిదే బర్రె’ అన్న చందంగా బలవంతుడు బలహీనుడిని పీక్కు తినేవాడు. బడుగు, బలహీన వర్గాల హక్కులు, నిర్దాక్షిణ్యంగా కాలరాయబడేవి. అవినీతి, అక్రమాలు, దోపిడి, దౌర్జన్యాలు, సారాయి, జూదం, అశ్లీలత, వడ్డీ పిశాచం, హత్యలు, అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ ఖననం, భ్రూణహత్యలు తదితర సామాజిక నేరాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. ఆ కాలంలో స్త్రీజాతికి అసలు ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఉనికినే అంగీకరించేది కాదు ఆనాటి పురుషాధిక్య సమాజం.

మహిళా హక్కులు మరియు ఇస్లాం

మహిళా స్థాయి

నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంటిని వదిలి బయటకు రాకుండా స్త్రీ విముక్తి లేక సాధికారత సాధ్యం కాదని నేటి మహిళా సంఘాల తమ ప్రచార హోరుల ద్వారా మహిళా సమాజాన్ని ఉత్తేజ పరుస్తు న్నాయి.

నికాహ్ - పెళ్ళి

పెళ్ళి లేదావివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతులు ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో, సాధారణంగా సన్నిహిత మరియు లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిపార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.

 

 

 

                                                                ఇస్లాంలో సంప్రదాయ వివాహాలు


                  ఓ పురుషుడు స్త్రీ భార్యాభర్తల్లా చట్టం ప్రకారం జీవితo గడపడాన్ని వివాహం అంటారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  వివాహాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఇలా అన్నారు: ‘ఓ యువకుల్లారా! ఎవరికైతే పెళ్లి చేసుకొనే స్థోమత ఉందో వారు త్వరగా పెళ్లి చేసుకోండి. దీని వల్ల కళ్ళు మరియు రహస్య అవయవాలు పాపాల నుండి రక్షించబడుతాయి. ఎవరికైనా స్థోమత లేని పక్షంలో వారు ఉపవాసాలు ఉండవలెను. ఎందుకంటే ఉపవాసాలు కవచంగా ఉండి మనిషిని పాపాల నుండి కాపాడుతాయి. ”( సహీహ్ బుఖారీ vol 7:4, సహీహ్ ముస్లిం 1400)

Search Videos

Video Share RSS Module

Go to top