అస్సలాము అలైకుమ్

 

అస్సలాము అలైకుమ్ అనే అరబీ మాటకు మీకు సమాధానము కలుగుగాక అని అర్ధం. ముస్లిములు ఇతరులను కలిసినపుడు ముందుగా ఈ మాటతోనే వారి పలకరింపులు ప్రారంభమవుతాయి. నిజానికి ఇది దీవెన మాట. మనిషికి ఎల్లప్పుడూ శాంతి సమాధానము అవసరం కావున దేవుని తరపునుండి మీకు శాంతి సమాధానము కలగాలని ఎదుటి వారి కొరకు ప్రార్ధిస్తారన్న మాట. మహాప్రవక్త ముహమ్మద్(స) గారు ముస్లింలు తోటి ముస్లింలను (అనగా తమ తల్లి దండ్రులుగానీ, సంతానం గానీ, తోబుట్టువులు గానీ, స్నేహితులుగానీ, సమాజములోె ఎవరైనా) కలిసినపుడు తప్పని సరిగా సలాం చెప్పాలని, ఇది ముస్లింలకు ఇతర ముస్లింలపై ఉండే హక్కుఅని బోధించారు. అలాగే ఇంటిలోనికి ప్రవేశించునపుడు కూడా సలాం చెప్పాలని నేర్పారు. ఇతరుల ఇంటికి వెళ్ళినపుడు కూడా ముందుగా సలాం చెప్పాలని బోధించారు.

 

ఈవిధానం కేవలం నేటిముస్లిముల సాంప్రదాయమని చాలా మంది అపోహ పడుతుంటారు కాని ఇది ప్రతి ప్రవక్త అనుసరించిన పద్దతి. ఇది

దేవుడు మనిషికి నేర్పిన మొట్టమొదటి సంస్కార వచనం.

మొట్టమొదటి మానవుడు ఆదమ్(అ) దూతలను కలిసినపుడు మాట్లాడిన తొలిమాట.

ప్రవక్తలందరూ ఇతరులను కలిసేటపుడు ఆచరించిన సాంప్రదాయక పలుకు.

దూతలుకూడా ఇతరులను కలిసినపుడు పలకరించే పలకరింపు.

స్వర్గంలో అల్లాహ్ విశ్వాసులను కలిసినపుడు పలికే స్వాగత వచనం.

ప్రపంచంలోని ముస్లింలందరూ 1500 సం,,లనుండి తీర్పుదినంవరకూ పాటించే దీవెన వాక్యం.

ఎదుటి వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని దేవుని అడిగే ప్రార్ధన.

నా నుంచి మీకు ఎలాంటి కీడు జరగదని, నేను మీశ్రేయోభిలాషినని తెలిపే భరోసా పదం.

అంటరాని తనాన్నిరూపుమాపి అందరికీ స్నేహ హస్తాన్ని అందించే ఆశీర్వచనం.

అస్సలాము అలైకుమ్ అనే మాట బైబిల్ లో చాలా చోట్లఉంది. అయితే ఆపదాన్ని ఆయాభాషలలో అనువదించినందు వలన దాని అసలు రూపం మారిపోయింది గానీ ఆయా అనువాదాలకు అర్ధం మాత్రం అదే. తెలుగులో శాంతి, సమాదానము అని అనువదించారు. ఆపదాలు బైబిల్ లో మచ్చుకు కొన్ని చూడండి.

మత్తయి 28-9- యేసు వారిని ఎదుర్కొని – మీకు శుభమని చెప్పెను.  

లూకా10-5,6 – త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలడగవద్దు, మీరు ఏయింటనైనను ప్రవేసించునప్పుడు- ఈయింటికి సమాధానమగు గాక అని మొదటచెప్పుడి,  సమాధానపాత్రుడు అక్కడ ఉండినయెడల మీసమాధానము అతని మీద నిలుచును, లేని యెడల అది మీకు తిరిగి వచ్చును.

లూకా  24-36  - వారు ఈలాగు మాటలాడు చుండగా ఆయన వారి మధ్యను నిలిచి- మీకు సమాదానమవుగాకని వారితో అనెను.

యోహాను 14-27-సమాధానము మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. నాసమాధానమే  మీ కనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకనుగ్రహించుట లేదు. మీ హృదయమును  కలవరపడనియ్యకుడి. వెరవనియ్యకుడి...

యోహాను-20-19 ఆదివారము.....యేసు వచ్చి మధ్యను నిలిచి- మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను.

యోహాను 20-21-అప్పుడు యేసు – మరల  మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్నుపంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

యోహాను 20-26 ఎనిమిది దినములైన తరువాత...... యేసు వచ్చి మధ్యను నిలిచి- మీకు సమాధానము కలుగును గాక అనెను.

యెషయా 57-19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని  స్వస్థపరచెదనని  యెహోవా సెలవిచ్చుచున్నాడు.

1కొరింథీ1-3 మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపా సమాధానములు మీకు కలుగును గాక

2కొరింథీ 1-1 మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపయు సమాధానమును మీకు కలుగును గాక

గలతీ 1-2  తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును మీకు కలుగును గాక

ఎఫెసీ 1-1 మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపయు సమాధానమును మీకు కలుగును గాక

ఎఫెసీ 2-17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని  సమాధాన సువార్తను ప్రకటించెను.

ఫిలిప్పీ 1-1 మన తండ్రియగు దేవుని నుండియు, ప్రభువగు యేసుక్రీస్తు నుండియు  కృపయు సమాధానమును మీకు కలుగును గాక

కొలొస్స1-1 మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక

1థెస్సలొనీక 1-1 కృపయు సమాధానమును మీకు కలుగును గాక

2థెస్సలొనీక1-1  తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపయు సమాధానమును మీకు కలుగును గాక

1తిమోతి1-2(అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు)  మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక

2తిమోతి 1-1,2 (అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు) మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు  కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక

తీతుకు 1-4 తండ్రియైన దేవుని నుండియు, మనరక్షకుడైన క్రీస్తుయేసు నుండియు  కృపయు కనికరమును సమాధానమును నీకు

 కలుగును గాక

యాకోబు 1-1 దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదిరియున్న పండ్రెండు గోత్రముల వారికి  శుభమని చెప్పి వ్రాయునది.

2పేతురు 1-2.... మావలెనే  అమూల్యమైన  విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి  వ్రాయునది.

2యోహాను 1-పెద్దనైన నేను  ఏర్పరచబడినదైన అమ్మ గారికిని  ఆమె పిల్లలకును  శుభమని చెప్పి వ్రాయునది.

3యోహాను 1-1  పెద్దనైన నేను  సత్యమును బట్టి  ప్రేమించు  రియుడైన గాయు నకు  శుభమని చెప్పి వ్రాయునది.

3యోహాను-1-14 శీఘ్రముగా  నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా  మాటలాడుకొనెదము

నీకు సమాధానము కలుగును గాక

యూదా 1-2  మీకు కనికరమును సమాధానమును  ప్రేమయు  విస్తరించునుగాక

కీర్తనలు-120-7 నేను కోరునది సమాధానమే

కీర్తనలు125-5  ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక

కీర్తనలు 128-6  ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక

యోబు22-21  ఆయనతో సహవాసము చేసిన యెడల  నీకు సమాధానము కలుగును  ఆలాగున నీకు మేలు కలుగును.

What is men’s ultimate –Goal?           ----Peace.

Search Videos

Video Share RSS Module

Go to top