ఖుర్ఆన్ సూచించే 100 సూచనలు

1. సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి. (ఖుర్ఆన్2:42)

2. ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణంచేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? (ఖుర్ఆన్2:44)

3. భువిలో అలజడిని రేపుతూ తిరగకండి. (ఖుర్ఆన్2:60)

4. మానవులనుమస్జిదులకు వెళ్ళకుండా ఆపకండి. (ఖుర్ఆన్2:114)

5. గుడ్డిగా ఎవరినీ అనుసరించకండి. (ఖుర్ఆన్2:170)

6. ఇచ్చిన మాటపై నిలబడండి. (ఖుర్ఆన్2:177)

7. లంచగొండితనానికి పాల్పడకండి. (ఖుర్ఆన్2:188)

8. మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి.

(ఖుర్ఆన్2:190)

9. యుద్ధ నియమాలను పాటించండి. (ఖుర్ఆన్2:191)

10. అనాథలను రక్షించండి. (ఖుర్ఆన్2:220)

11. ఆశుద్ధావస్థలో భార్యలతో సమాగమం జరపకండి. (ఖుర్ఆన్2:222)

12. తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు పాలు పట్టాలి.(ఖుర్ఆన్2:233)

13. రాజ్యాధికారానికి దాని అర్హతగలవాడిని ఎన్నుకోండి.

(ఖుర్ఆన్2:247)

14. ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. (ఖుర్ఆన్2:256)

15. దానధర్మాలు చేసిన వారిపై తమ ఉపకారాన్ని చాటుకుని దాన్నివృధాచేసుకోకండి. (ఖుర్ఆన్2:264)

16. దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలకు సహాయపడండి.

(ఖుర్ఆన్2:273)

17. వడ్డీ సొమ్ము తినకండి. (ఖుర్ఆన్2:275)

18. ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. (ఖుర్ఆన్2:280)

19. అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడుదాన్ని (స్పష్టంగా) వ్రాసుకోండి.(ఖుర్ఆన్2:282)

20. నమ్మకాన్నివమ్ముచేయకండి. (ఖుర్ఆన్2:283)

21. ఇతరుల మాటలుగోడచాటుగా వినకండి, చాడీలు చెప్పకండి. (ఖుర్ఆన్2:283)

22. దైవప్రవక్తలందరినీ విశ్వసించాలి. (ఖుర్ఆన్2:285)

23. ఎవరీపైన కూడా అతని సామర్ధ్యానికి మించి భారం వేయకండి. (ఖుర్ఆన్2:286)

24. పరస్పరంచీలిపోకండి. (ఖుర్ఆన్3:103)

25. కోపాన్ని అణచుకోండి. (ఖుర్ఆన్3:134)

26. మొరటుగా మాట్లాడకండి. (ఖుర్ఆన్3:159)

27. భూమ్యాకాశాల సృష్టి గురించిదీర్ఘంగా యోచన చేయండి. (ఖుర్ఆన్3:191)

28. పురుషులైనా, స్త్రీలైనా తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలం పొందుతారు. (ఖుర్ఆన్3:195)

29. చనిపోయిన వారి ఆస్తిని అతని కుటుంబీకుల మధ్య పంచిపెట్టాలి. (ఖుర్ఆన్4:7)

30. ఆస్తిలో స్త్రీలకు కూడా భాగంఉంది. (ఖుర్ఆన్4:7)

31. అనాథల సొమ్మును కాజేయకండి. (ఖుర్ఆన్4:10)

32. మీ కొరకు నిషేధించబడినవారు- మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (మీ పిన్నమ్మ పెద్దమ్మలు), మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళకూతుళ్ళు

(మేనకోడళ్ళు), మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కాచెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు (అత్తలు), మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల (ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన) మీ సంరక్షణలోనున్నకూతుళ్ళు - ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే (కేవలం పెళ్ళిమాత్రం చేసుకుని వారికి విడాకులు

యిచ్చేసివున్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం) మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి (స్ఖలించబడిన వీర్యంతో) పుట్టిన మీ కొడుకుల భార్యలు (కోడళ్ళు) మీ కోసం నిషేధించబడ్డారు. (ఏకకాలంలో) ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే, లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను. (ఖుర్ఆన్4:23)

33. ఇతరుల ధనాన్ని అన్యాయంగా కాజేయకండి. (ఖుర్ఆన్4:29)

34. మగవాడు కుటుంబాన్ని పోషించాలి. (ఖుర్ఆన్4:34)

35. అందరితో ఆప్యాయంగా మెలగండి. (ఖుర్ఆన్4:36)

36. పిసినారితనం చూపకండి. (ఖుర్ఆన్4:37)

37. ఇతరులపై అసూయ చెందకండి. (ఖుర్ఆన్4: 54)

38. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. (ఖుర్ఆన్4:58)

39. ఒకరుఇంకొకరిని చంపటం ఎంతమాత్రం తగదు. (ఖుర్ఆన్4:92)

40. ద్రోహానికిపాల్పడేవారితరఫునవాదిగాఉండకూడదు. (ఖుర్ఆన్4:105)

41.న్యాయంవిషయంలోగట్టిగానిలబడండి.ఖుర్ఆన్4:135)

42. మంచి పనుల్లో ఒండొకరికితోడ్పడండి. (ఖుర్ఆన్5:2)

43. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లోఎవరితోనూసహకరించకండి. (ఖుర్ఆన్5:2)

44. మృత పశువు, రక్తం, పంది మాంసం,అల్లాహ్ పేరుగాకవేరితరులపేరు ఉచ్చరించబడినది మీ కొరకు నిషేధించబడ్డాయి.(ఖుర్ఆన్5:3)

45. న్యాయంగా వ్యవహరించండి. (ఖుర్ఆన్5:8)

46. తప్పు చేసినవారినిఉచితంగాశిక్షించాలి. (ఖుర్ఆన్5:38)

47. పాపిష్టి, అధర్మమైన కార్యాలకు విరుద్ధంగా పోరాడాలి. (ఖుర్ఆన్5:63)

48. సారాయి,మత్తుపదార్థాల జోలికి వెళ్ళకండి. (ఖుర్ఆన్5:90)

49. జూదం కూడా నిషేధించబడింది. (ఖుర్ఆన్5:90)

50. ఇతరులు ఆరాధించే వాటిని దూషించకండి. (ఖుర్ఆన్6:108)

51. ఎక్కువ మంది చెప్పిందే సత్యానికి ప్రతీక కాదు. (ఖుర్ఆన్6:116)

52. కొలతలు తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి.(ఖుర్ఆన్6:152)

53. అహంకారం చూపకండి. (ఖుర్ఆన్7:13)

54. తినండి, త్రాగండి. కాని మితిమీరకండి. (ఖుర్ఆన్7:31)

55. మీరుమస్జిదుకు హాజరైన ప్రతిసారీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. (ఖుర్ఆన్7:31)

56. ఇతరుల తప్పులపై మన్నింపుల వైఖరి అవలంబించు. (ఖుర్ఆన్7:199)

57. యుద్ధభూమిలో వెన్నుచూపకండి. (ఖుర్ఆన్8:15)

58.ఒకవేళఏవ్యక్తిఅయినానీశరణుకోరితే,అతనుఅతనికినువ్వుఆశ్రయమివ్వు. (ఖుర్ఆన్9:6)

59. పరిశుద్ధతను పాటించండి. (ఖుర్ఆన్9:108)

60. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. (ఖుర్ఆన్12:87)

61. మరి ఎవరయినా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి,ఆపైన పశ్చాత్తాపం చెందితే,దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు,అమితంగా కనికరించేవాడు.(ఖుర్ఆన్16:119)

62.అల్లాహ్మార్గంవైపుజనులనువివేకంతోనూ,చక్కనిఉపదేశంతోనూపిలువు.అత్యుత్తమరీతిలోవారితోసంభాషణజరుపు.(ఖుర్ఆన్16:125)

63. పెడదారిపట్టేవాడుతనకీడుకుతానేకారకుడౌతాడు. (ఖుర్ఆన్17:15)

64. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి.(ఖుర్ఆన్17:23)

65. తల్లిదండ్రులయెడల అసభ్యంగా ప్రవర్తించకూడదు. (ఖుర్ఆన్17:23)

66. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. (ఖుర్ఆన్17:29)

67. దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి.(ఖుర్ఆన్17:31)

68. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు. (ఖుర్ఆన్17:32)

69. నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంటపడకు. (ఖుర్ఆన్17:36)

70. ప్రజలతోమృదువుగా మాట్లాడండి. (ఖుర్ఆన్20:44)

71. పనికిమాలిన వాటిని పట్టించుకోకూడదు. (ఖుర్ఆన్23:3)

72. ఇతరులఇండ్లలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి. (ఖుర్ఆన్24:27)

73. ఎవరైతే కేవలంఅల్లాహ్ పై విశ్వాసం ఉంచుతారోఅల్లాహ్ వారికి రక్షణ కలిపిస్తాడు. (ఖుర్ఆన్24:55)

74. తల్లిదండ్రుల అనుమతి లేనిదే వారి గదిలోనికి ప్రవేశించరాదు. (ఖుర్ఆన్24:58)

75. నేలపై వినమ్రులై నడవండి. (ఖుర్ఆన్25:63)

76. నీప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. (ఖుర్ఆన్28:77)

77. అల్లాహ్తోపాటు మరే దేవుణ్ణీమొరపెట్టుకోకు. (ఖుర్ఆన్28:88)

78. స్వలింగ సంపర్కానికి పాల్పడకండి. (ఖుర్ఆన్29:29)

79. సత్కార్యాల గురించి ఆజ్ఞాపించు, చెడు పనుల నుండి వారిస్తూ ఉండు. (ఖుర్ఆన్31:17)

80. భూమిపై నిక్కుతూ నడవకు. (ఖుర్ఆన్31:18)

81. కంఠ స్వరాన్ని తగ్గించి మాట్లాడండి. (ఖుర్ఆన్31:19)

82. స్త్రీలు సింగారాన్ని చూపిస్తూ తిరగరాదు. (ఖుర్ఆన్33:33)

83. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. (ఖుర్ఆన్39:53)

84. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి.(ఖుర్ఆన్39:53)

85. చెడును మంచి ద్వారాతొలగించండి. (ఖుర్ఆన్41:34)

86. ప్రతి పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరగాలి. (ఖుర్ఆన్42:38)

87. రెండు పక్షాల వారు పరస్పరం గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి. (ఖుర్ఆన్49:9)

88. ఇతరులను ఎగతాళి చేయరాదు. (ఖుర్ఆన్49:11)

89. అతిగా అనుమానించకండి. (ఖుర్ఆన్49:12)

90. కూపీలులాగకండి.చాడీలు చెప్పకండి. (ఖుర్ఆన్49:12)

91.యదార్థానికిమీలోఅందరికన్నాఎక్కువగాభయభక్తులుగలవాడేఅల్లాహ్ సమక్షంలోఎక్కువగాఆదరణీయుడు.(ఖుర్ఆన్49:13)

92. అతిథులనుగౌరవించండి. (ఖుర్ఆన్51:26)

93. మీ సంపదలో నుంచి దానధర్మాలు చేయండి. (ఖుర్ఆన్57:7)

94. సన్యాసత్వానికి ఇస్లాంలోచోటులేదు. (ఖుర్ఆన్57:27)

95. జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. (ఖుర్ఆన్58:11)

96. ముస్లిమేతరులతోసద్వ్యవహారం చేయండి, న్యాయంగా వ్యవహరించండి. (ఖుర్ఆన్60:8)

97. ఆత్మలోభత్వం నుండి కాపాడుకోండి.(ఖుర్ఆన్64:16)

98. క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.(ఖుర్ఆన్73:20)

99. యాచించేవానిని కసిరికొట్టకు. (ఖుర్ఆన్93:10)

100. నిరుపేదకు అన్నం పెట్టమని ప్రేరేపించండి. (ఖుర్ఆన్107:3)

Search Videos

Video Share RSS Module

Go to top