6 ఈమాన్ మూలస్థంభాలు


పరలోక చింతన సమస్త బాధలకు పరిష్కారం

Think about Hereafter is Remedy for all Pains

ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయావస్తువుగా అభి వర్ణించడానికి కారణం- క్రీడ మనిషిని ఉల్లాస పరిస్తే, మాయ మనిషిని మోసపుచ్చుతుంది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది. అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది.

అందమైన ఈ జీవితం ఏదోఒక రోజు అంతమయిపోతుంది. మన శ్రమను, కృషిని అశాశ్వతమయిన ఐహిక జీవితానికే ధారపోసి పరలొకాన్ని విస్మరించడం అంటే, నకిలీ నగల మోజులో అసలు సిసలయిన పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే. అందుకని ప్రాంపంచిక జీవితాన్ని పరలోకంలో సుమధుర ఫలాలను అందించే పంట పొలంగా వినియోగిం చుకోవాలి. ఏదో ఒకనాడు నశించిపోయే తాత్కాలిక తటాకం కోసం అనం తమైన, అనశ్వరమైన పరలోకాన్ని పాడు చేసుకోవడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. ప్రాపంచిక జీవితం పరలోక సాఫల్యానికి సాధనంగా ఉపయోగ పడాలే గానీ, మరులు గొలిపే ఈ అందమైన ప్రపంచం పరలోకంలో కష్టాల్ని, నష్టాల్ని మిగిల్చేదిగా మారకూడదు.

అర్కాన్ అల్ ఈమాన్

Pillars of Faith(విశ్వాసపు మూలస్థంభాలు)

ఇస్లా౦ ధర్మానికి చెందిన విశ్వాసాలు మరియు నమ్మకాలు ఆరు(6) ప్రధాన అంశాలు, వాటిని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. వీటి ప్రాధాన్యత రీత్యా ప్రతి ముస్లిం వాటిని గురించి తప్పని సరిగా తెలుసుకోవాలి. ఈవిశ్వాసాలలో ఏ ఒక్క దాని విషయంలో అజాగ్రత్తవహించినా, వ్యతిరేకించినా కాఫిర్ అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ముస్లిం నమ్మకాలను గురించి తెలుసుకోండి.

ఒకే నిజ దైవానికి సంబంధించిన వ్యక్తిగత పేరు అల్లాహ్

6. అల్ ఖదర్ (పూర్వనిర్దిష్ట విధివ్రాత) పై విశ్వాసం:

తక్దీర్ మరియు విధివ్రాత పై విశ్వాసం అంటే మనకు జరిగే మంచి-చెడులు, లాభనష్టాలు,
సుఖదు:ఖాలు మొదలైనవన్నీ అల్లాహ్ ఇష్టానుసారమే జరుగును మరియు అల్లాహ్ యొక్క
అనుజ్ఞ లేకుండా ఏదీ జరుగదు అని విశ్వసించటం.

5. అంతిమదినం పై విశ్వాసం:

అంతిమదినంపై విశ్వాసం అంటే మరణించిన తరువాత మరల లేపబడతారని మరియు ప్రతి ఒక్కరి
పాపపుణ్యాల లెక్క తీసుకోబడుతుందని విశ్వసించటం. ఆ తరువాత పాపులు కఠినంగా శిక్షించబడుదురు
మరియు పుణ్యమానవులు సత్కరించబడుదురు. ‘అంతిమదినంపై విశ్వాసం చూపటంలో’ అల్లాహ్
మరియు ఆయన సందేశహరుడు - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన మరణానంతర
సంఘటనలన్నింటినీ విశ్వసించటం కూడా ఉన్నది.

4. సందేశహరులపై విశ్వాసం:
అల్లాహ్ యొక్క సందేశహరులందరినీ సామూహికంగా విశ్వసించటం తప్పని సరి. నరకం గురించి హెచ్చరించడానికి
మరియు స్వర్గం గురించి సంతోషవార్తలు తెలియజేయడానికి అల్లాహ్ తన దాసుల వద్దకు నిస్సందేహంగా తన
సందేశహరులను పంపాడని మనం నమ్మవలెను.

3. దివ్యగ్రంథాలపై విశ్వాసం:
‘దివ్యగ్రంథాలపై విశ్వాసం’అంటే ‘అల్లాహ్ తన ప్రవక్తలు మరియు రసూల్ ల (సందేశహరుల) పై వహీ (దైవవాణి)
రూపంలో జిబ్రయీలు అలైహిస్సలాం ద్వారా తన దివ్యసందేశాలను అవతరింప జేసేవాడ’ని మనస్పూర్తిగా విశ్వసించటం.
వారు ఆ దివ్యసందేశాలను ప్రజలకు అందజేసేవారు.

2. మలాయికలపై (దైవదూతలపై) విశ్వాసం:


                           ‘మలాయికలపై విశ్వాసం’ అంటే ‘దైవదూతల ఉనికిని మనస్పూర్తిగా విశ్వసించటం’అని అర్థం.
అల్లాహ్ సృష్టించిన ప్రాణులలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే, ఎల్లప్పుడూ ఆయననే కొనియాడుతూ ఉండే
మరియు ‘అల్లాహ్ ఆజ్ఞాపించే ఏ పనినీ అస్సలు తిరస్కరించని, అల్లాహ్ యొక్క ప్రతి ఆదేశాన్ని తూ.చ. తప్పక పాటించే’
ప్రత్యేక సృష్టియే మలాయికలు.

1. అల్లాహ్ పై విశ్వాసం:
                అంటే వాస్తవానికి ‘కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధ్యుడు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆ యోగ్యత లేదు’
అని మనస్పూర్తిగా నమ్మటం. ఎందుకంటే మానవులను సృష్టించేదీ, వారిని పోషించేదీ, వారిపై దయ చూపేదీ,
ప్రతి విషయంలో వారికి మార్గదర్శకత్వం వహించేదీ ఆయనే. ఇంకా వారి ఆంతరంగిక మరియు బహిర్గత విషయాలు
ఎరిగినవాడూ, వారి ఆచరణల లెక్కలు తీసుకునేవాడూ ఆయనే. పాపాత్ములను వారి చెడు పనుల కారణంగా శిక్షిస్తాడు
మరియు పుణ్యాత్ములను వారి మంచి పనుల కారణంగా సత్కరిస్తాడు. సృష్టించగలిగే సామర్ధ్యం ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ లేదు.

                             ఈమాన్  అర్ధం మరియు అర్కాన్ అల్ ఈమాన్ 6.

 

'ఈమాన్ లేదా ఇమాణ్ (అరబ్బీالإيمان‎) ఇస్లామీయ ధార్మిక శాస్త్రము ప్రకారం, ఇస్లామీయ తాత్విక మరియు ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసుని విశ్వాసమే ఈ ఈమాన్. ఈమాన్ యొక్క సీదా సాదా విశదీకరణ; ఇస్లామీయ మూల ఆరు విశ్వాసాలపై విశ్వాసం ఉంచడం, వీటినే "అర్కాన్-అల్-ఈమాన్" (ఈమాన్ యొక్క స్థూల విషయాలు) అనీ అంటారు. వీటిని విశ్వసించని యెడల ముస్లిం సంపూర్ణ ముస్లిం కాలేడు.

Search Videos

Video Share RSS Module

Go to top